Tuesday: మంగళవారం రోజు ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. హనుమంతుడి అనుగ్రహం కలగడం ఖాయం!
మంగళవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా హనుమంతుడు అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Tue - 8 October 24

హిందూ మతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం రోజు హనుమంతుడికి అంకితం చేయబడింది. మంగళవారం రోజు హనుమంతుడితో పాటు చాలామంది దేవుళ్లను పూజిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం మంది హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు. కొందరు శనివారం రోజు పూజిస్తే మరి కొందరు మంగళవారం రోజు పూజిస్తూ ఉంటారు. అయితే మంగళవారం రోజు హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల తప్పకుండా ఆయన కోరిన కోరికలు అని నెరవేరుస్తాడని నమ్మకం.
మరి హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మంగళవారం రోజు ఉదయం స్నానం చేసి హనుమంతుడిని పూజించాలి. ఆయన ముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాల. అలాగే ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ సులభమైన పరిష్కారంతో హనుమంతుడి అపారమైన ఆశీర్వాదాలు భక్తులకు లభిస్తాయి. హనుమంతుడిని పూజించడం వల్ల ఉద్యోగ రంగంలో ఆహ్లాదకరమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. మంగళవారం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ రోజు తప్పు చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడు.ఆ రోజు ఎలాంటి మత్తు పదార్థాలను సేవించకూడదట. ముఖ్యంగా ఆ రోజు మాంసం, చేపలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
అంతేకాదు వ్యక్తి తన స్వభావంలో సరళత, భక్తి భావనను ఉంచుకోవాలట. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడట. ఇకపోతే మంగళవారం దానధర్మాలు చేయడం కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయట. ఈ రోజున వేయించిన శనగలు, కొబ్బరి, బెల్లం, నెయ్యి, బియ్యం వంటి వాటిని దానం చేయడం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా శత్రువుల నుంచి ఉపశమనం కోసం ఈ రోజున ఎర్ర మిరపకాయలను దానం చేయడం కూడా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు.