Tuesday Puja: మంగళవారం ఇలాంటి పరిహారాలు పాటిస్తే చాలు.. హనుమాన్ అనుగ్రహం కలగాల్సిందే!
మంగళవారం రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే హనుమంతుడి అనుగ్రహం కలిగి కష్టాలు దూరం అవుతాయి అని చెబుతున్నారు. అయితే మరి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Tue - 13 May 25

హిందూమతంలో వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబండి. అలా మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. కొందరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. మంగళవారం అంటే ఆంజనేయస్వామికి చాలా ప్రీతికరం. ఈ రోజున ఉపవాసం ఉండి హనుమాన్ ని పూజిస్తూ కొన్ని పనులు చేయడం వలన ఆంజనేయస్వామి అనుగ్రహం మీ సొంతం అవడం ఖాయం అంటున్నాడు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రామనామ జపం ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా హనుమంతుడు ఉంటాడని భక్తులు నమ్మకం. రాముడుని కొలిచే వారికి రాముడు అనుగ్రహంతో పాటు హనుమంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి మంగళవారం రామ నామ జపం చేయడం ద్వారా హనుమంతుని ఆశీర్వాదాలను పొందవచ్చట. ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి అనంతరం మీకు తెలిసిన ఏ రూపంలోనైనా రాముని నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించాలట. అదేవిధంగా హనుమంతుడి స్వభావం, సద్గుణాలు, విజయాలను తెలియజేసే 40 శ్లోకాలు గల హనుమాన్ చాలీసాను ప్రతి మంగళవారం పటించడం శుభప్రదం అని చెబుతున్నారు.
అలాగే హనుమంతుడు వానరుడు కాబట్టి కోతులకు మంగళవారం రోజు ఆహారం పెట్టడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాడట. అదేవిధంగా మంగళవారం రోజు హనుమంతుడికి ప్రసాదంగా శనగలు పెట్టడం వల్ల మంచి జరుగుతుందట. హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత వాటిని భక్తులకు ప్రసాదంగా పంచడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. మంగళవారం రోజున మాత్రమే కాకుండా, సాధారణంగా హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మచర్యాన్ని పాటించడం మంచిది అని చెబుతున్నారు. అతిగా తినడం, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, అధిక కామం, దురాశ లేదా కోపం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయట. అదేవిధంగా మంగళవారం రోజు అవసరం ఉన్న వారికి సహాయం చేయడం వల్ల అనుమంతుడి అనుగ్రహం కలుగుతుందట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయాలని, ఆహారం, బట్టలు లేదా డబ్బును దానం చేయండి లేదా మూగ జీవులకు సేవ చేయాలని చెబుతున్నారు పండితులు.