TTD : వర్షాలు కురవాలని టీటీడీ యాగాలు..
తిరుమలలో ఈ నెల ఆగస్టు 22 నుండి 26 వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం చేయనున్నారు.
- By News Desk Published Date - 07:49 PM, Wed - 16 August 23

కొన్ని రోజుల క్రితం ఒకేసారి కుంభవృష్టిలా వర్షాలు(Rains) కురిసి వెళ్లిపోయాయి. తెలంగాణ(Telangana)లో అప్పుడప్పుడన్నా వర్షాలు పలకరిస్తున్నాయి కానీ ఏపీ(AP)లో మాత్రం మళ్ళీ ఇప్పటిదాకా వర్షాలు పడలేదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వర్షాలు కురవడానికి యాగాలు(Yagam) చేయాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో ఈ నెల ఆగస్టు 22 నుండి 26 వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం చేయనున్నారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ యాగం చేయనున్నట్టు టీటీడీ తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ యాగ కార్యక్రమంలో దాదాపు 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు పాల్గొననున్నారు. ఇప్పటికే టీటీడీ అధికారులు ఈ యాగానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేస్తున్నారు టీటీడీ అధికారులు.
Also Read : TTD : చేతిలో కర్ర ఉంటె పులి దాడి చేయదా..? టీటీడీ నిర్ణయం ఎంత వరకు కరెక్ట్..?