Raja Yoga : ఆ మూడు రాశులవారికి త్వరలో లక్ష్మీనారాయణ యోగం
త్వరలోనే కొన్ని రాశులవారికి రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం సిద్ధించనుంది.
- By Pasha Published Date - 07:39 AM, Thu - 11 July 24

Raja Yoga : త్వరలోనే కొన్ని రాశులవారికి రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం సిద్ధించనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశి, అంశ చక్రాల్లో ఉన్న గ్రహస్థానాలను బట్టి ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలను బట్టి గ్రహాల అనుగ్రహం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో పండితులు నిర్ణయిస్తారు. ప్రస్తుతం బుధ గ్రహం, శుక్ర గ్రహం కర్కాటక రాశిలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు ఒకేరాశిలో సంచరించినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.
We’re now on WhatsApp. Click to Join
బుధుడు జూన్ 30న కర్కాటక రాశిలోకి అడుగుపెట్టాడు. జులై 20 వరకూ బుధుడు ఇదే రాశిలో ఉండి.. ఆ తర్వాత సింహ రాశిలోకి మారుతాడు. జులై 31 న వక్రంలో సంచరించి ఆగస్టు 11 వరకూ ఇదే రాశిలో బుధుడు సంచరిస్తాడు. ఆగస్టు 22న తిరోగమనం పూర్తిచేసుకొని తిరిగి సెప్టెంబరు 1న సింహరాశిలోకి బుధుడు అడుగుపెడతాడు. జులై 7న కర్కాటక రాశిలోకి అడుగుపెట్టిన శుక్రుడు.. ఈ నెలాఖరు వరకూ అదే రాశిలో సంచరిస్తాడు. ఈనెల 31 తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంచారం ప్రభావంతో మూడు రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం సిద్ధించబోతోంది. బుధుడు మేధస్సుకి, వ్యాపారాభివృద్ధికి మంచి చేస్తాడు. శుక్రుడు సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు.ఈ రెండు గ్రహాల కలయిక వల్ల పలు రాశులవారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
Also Read :Muharram: 17న మొహర్రం.. ఈ పండుగ చరిత్ర, సందేశం ఇదీ..
- కర్కాటక రాశిలోనే లక్ష్మీనారాయణ యోగం(Raja Yoga) ఏర్పడుతోంది. అందుకే ఆ రాశి వారికి శుభాలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ జీవితంలో ఉండే తగాదాలు సమసిపోతాయి.
- లక్ష్మీనారాయణ యోగం వల్ల సింహరాశివారికి శుభాలు జరుగుతాయి. బిజినెస్‌లో లాభాలు వస్తాయి. ఆదాయం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు సౌకర్యవంతమైన జాబ్ లభిస్తుంది. డబ్బులు చేతికి అందుతాయి.
- వృశ్చిక రాశి వారికి ఈ యోగంతో ప్రయోజనాలు చేకూరుతాయి. అకస్మాత్తుగా ధనలాభం జరుగుతుంది. కోర్టు కేసుల సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగు అవుతుంది. పెట్టుబడులతో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పెళ్లికానివారికి వివాహయోగం కలగబోతోంది.
Also Read :Chicken Cause Cancer: షాకింగ్.. చికెన్ తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..?
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.