HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >This Is The Specialty Of Ayyappaswams Song Harivarasanam

Ayyappa Song: అయ్యప్పస్వాముల ‘హరివరాసనం’ పాటకు ఉన్న విశిష్టత ఇదే

అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం" గానం చేయడం ఒక సంప్రదాయం.

  • By Balu J Published Date - 01:04 PM, Thu - 16 November 23
  • daily-hunt
Yogasanam
Do You Know The Reason Why Ayyappa Appears In Yogasanam

Ayyappa Song: ఎక్కడైనా అయ్యప్ప పూజలు ప్రారంభమయ్యాయంటే.. కచ్చితంగా అక్కడ ఓ ప్రత్యేక పాట మార్మోగుతుంది. ఆ పాటే హరివరాసనం.. అయ్యప్ప స్వాముల ఈ పాటను ఆలపించడానికి అనేక కారణాలున్నాయట. అయ్యప్ప పూజ చివరిలో “హరివరాసనం” లేదా “శ్రీ హరిహరాత్మజాష్టకం” గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు.

ఈ స్తోత్రాన్ని “కుంబకుడి కులతూర్ అయ్యర్” రచించాడు.1955 సంవత్సరంలో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆప్రాంతం నిర్మానుష్యంగా వుండేది.మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు.

ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు.అప్పట్లో “ఈశ్వరన్ నంబూద్రి” అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో “హరివరాసనం” స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.

హరివరాసనం విశ్వమోహనం – హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం నిత్యనర్తనం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణకీర్తనం శక్తమానసం – భరణలోలుపం* *నర్తనాలసం*
అరుణభాసురం భూతనాయకం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
ప్రణయసత్యకం ప్రాణనాయకం – ప్రణతకల్పకం సుప్రభాంచితం
ప్రణవమనీద్రం కీర్తనప్రియం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
తురగవాహనం సుందరాననం – వరగధాయుధం వేదవర్ణితం
గురుకృపాకరం కీర్తనప్రియం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
త్రిభువనార్చితం దేవతాత్మకం – త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
భవభయాపహం భావుకావహం – భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
కళమృదుస్మితం సుందరాననం – కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరి వాజివాహనం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శ్రితజనప్రియం చింతితప్రదం – శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayyappa Deeksha
  • ayyappa mala
  • devotees
  • special song

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd