Lord Shiva offerings: శివలింగానికి ఈ వస్తువులను అర్పించకూడదట.. అవి ఏంటంటే?
- By Anshu Published Date - 11:24 AM, Sat - 16 July 22

దేవదేవతలలో ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే. కోరిన కోరికలను తీర్చే బోలా శంకరుడిగా, ముక్కంటిశ్వరుడిగా ఆయనను పూజిస్తూ ఉంటారు. అయితే పరమేశ్వరునికి పూజ చేసే సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. పూజ విషయంలో మిగిలిన దేవతలకు, శివుడికి కొన్ని విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయి. మరి ఆ పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఎటువంటి పొరపాటు చేయకూడదు. ఎటువంటివి సమర్పించకకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడికి పూజ చేసే సమయంలో సింధూరాన్ని సమర్పించకూడదు. సింధూరం చాలా మంది దేవతలకు ఎంతో ప్రియమైంది.
మహిళలు తమ భర్తతో ఆయుష్షుతో పోలుస్తారు. ఇదే సమయంలో శివుడిని డిస్ట్రాయర్ అని పిలుస్తారు. కాబట్టి శివలింగంపై సింధూరం అర్పించరు. అలాగే సనాతన ధర్మం ప్రకారం పసుపును చాలా స్వచ్ఛమైన, పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కానీ శివుడికి మాత్రం పసుపును వినియోగించరు. శాస్త్రాల ప్రకారం శివలింగం పురుష తత్వానికి చిహ్నం. పసుపు మహిళలకు సంబంధించింది. శంకరుడికి పసుపు ఇవ్వకపోవడానికి ఇదే కారణం. శివారాధనలో మీరు పసుపును ఉపయోగిస్తే అది నిరుపయోగంగా మారుతుంది. శంఖంతో శివిలింగానికి నీటిని అందించకూడదు.
శంఖం నుంచి దేవతలకు నీటిని అర్పిస్తారు. కానీ శివారాధనలో మాత్రం శంఖాన్ని ఉపయోగించకూడదు. అదేవిధంగా శివలింగంపై కొబ్బరి నీళ్లు సమర్పించరాదు. అయితే శివుడిని కొబ్బరికాయతో పూజిస్తారు కానీ కొబ్బరి నీటిని సమర్పించకూడదు. అయితే కొబ్బరికాయను శివలింగం ముందు కొట్టవచ్చు కానీ ఆ నీటిని శివలింగానికి సమర్పించకూడదు. అలాగే ఎరుపు రంగు పూలు శివలింగానికి ఎప్పుడూ ఇవ్వకూడదు. వీటిని అర్పించడం వల్ల ఆ పూజాఫలం రాదని నమ్ముతారు. శివుడికి తెల్లని పూలు మాత్రమే అర్పించాలీ.