Naivedyam: దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నారా.. అయితే ఈ ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?
దేవుడికి నైవేద్యం సమర్పించేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఏ పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Sat - 22 February 25

మామూలుగా చాలామంది దేవుడికి ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన సందర్భాలలో దేవుడికి నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారాంతంలో, పండుగ సమయాలలో పూజలు చేసే దేవుళ్ళకి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ రైల్వేధ్యాలు సమర్పించే సమయంలో చాలా మంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల పూజా చేసిన ఫలితం కూడా దక్కదని చెబుతున్నారు.
మరి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. చాలా మంది చేసే తప్పు దేవుడి కోసం నైవేద్యం చేసిన దానిలో నుంచి కొంత విడిగా పక్కన తీసి పెట్టడం. అయితే ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు. పెట్టే పాత్రలో నిండుగా
పెట్టాలట. అలాగే చాలామంది నైవేద్యం పెట్టిన తర్వాత నీరు పెట్టడం మరిచిపోతూ ఉంటారు. కానీ నైవేద్యంతో పాటు నీరు కూడా పెట్టాలని చెబుతున్నారు. నైవేద్యం పెట్టి నీళ్లు పెట్టకపోవడం అన్నది తప్పుగా భావించాలని చెబుతున్నారు.
చాలా వరకు నైవేద్యాల కోసం చాలా మంది చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా అస్సలు చేయకూడదట. నైవేద్యం చేసేటప్పుడు చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. అలాగే నైవేద్యం పెట్టిన తర్వాత వెంటనే తీసేయకూడదట. ఎక్కువ సేపు దేవుడి దగ్గర ఉంచడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. అలాగే నైవేద్యం చేసేటప్పుడు గేదె పాలు, గేదె నెయ్యికి బదులుగా ఆవు పాలు ఆవు నెయ్యి ఉపయోగిస్తే దేవుడి అనుగ్రహం తొందరగా లభిస్తుందట. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వేడివేడిగా ఉన్న నైవేద్యాన్ని అస్సలు సమర్పించకూడదట. కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టాలని చెబుతున్నారు.