Spiritual: వాడిపోయిన పూలతో పూజ చేస్తున్నారా.. అయితే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే!
వాడిపోయిన పువ్వులతో పూజ అసలు చేయకూడదని అలా చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 12:30 PM, Thu - 5 December 24

సాధారణంగా పూజ చేసేటప్పుడు దేవుడిని రకరకాల పువ్వులతో మనం అలంకరిస్తూ ఉంటాం. ఒక్కో దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ప్రీతికరం అని ఆ పువ్వులను ఎక్కడెక్కడ నుంచో తీసుకువచ్చి దేవుళ్ళకు సమర్పిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ పువ్వులు ఎక్కువగా తీసుకువచ్చి వాడి పోతున్నా కూడా నాలుగు ఐదు రోజుల తర్వాత ఆ పూలతోనే పూజ చేస్తూ ఉంటాము. కానీ అలా చేయటం మహా పాపం, దరిద్రాన్ని కొని తెచ్చుకోవటమే అంటున్నారు పండితులు. అలాగే వాడిన పూలతో పూజ చేయడం ఎంత దరిద్రమో మరికొన్ని వస్తువులని మన ఇంట్లో పెట్టుకోవడం వలన కూడా అంతే దరిద్రం అంటున్నారు.
అయితే పూజ చేసేటప్పుడు తాజా పూలను మాత్రమే సమర్పించలి. నిత్యం దేవుడి గదిని శుభ్రం చేయడం వాడిపోయిన పూలను తొలగించడం చేయాలి. ఒకసారి ఉపయోగించిన పూలతో దేవుడిని మళ్ళీ పూజించరాదు. చాలామంది అ పువ్వులు బాగా ఉన్నాయని ఫ్రెష్ గా ఉన్నాయని మళ్లీ మళ్లీ అదే పూలతో దేవుడిని పూజిస్తూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే దేవుడి కోసం ఒక్కసారి ఉపయోగించినా పువ్వులను మళ్ళీ మళ్ళీ ఉపయోగించకూడదట.
ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం కలగపోగా ఆ దైవ ఆగ్రహానికి లోనవ్వక తప్పదు చెబుతున్నారు. పువ్వులు లేకుండా చాలా వరకు పూజ పూర్తి కాదు. కానీ ఇలా ఉపయోగించిన పూలతో పూజ చేసే కంటే దీపం వెలిగించి అగృతులు వెలిగించడం మంచిది అని చెబుతున్నారు. దేవుడికి పూలు లేకుండా పూజ చేసిన సంతోషిస్తాడేమో కానీ ఒకసారి ఉపయోగించిన పూలను మళ్లీ ఉపయోగించి చేస్తే అసలు సంతోషించడానికి చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా పూజ గదిలో పూజలు చేసేటప్పుడు తాజా పుష్పాలను మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు.