Lakshmi Devi: లక్ష్మిదేవి అనుగ్రహం కావాలా.. అయితే తప్పకుండా వీటిని పూజించాల్సిందే!
Lakshmi Devi: లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం తప్పకుండా కొన్నింటిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, అష్టైశ్వర్యాలు సొంతమవుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 AM, Fri - 26 September 25

Lakshmi Devi: ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎన్నెన్నో పూజలో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. పైగా కొందరు ఎక్కువగా అప్పులు చేసి అప్పుల పాలు అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్నింటిని తప్పకుండా పూజించాలని చెబుతున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా శుక్రవారం రోజు ప్రత్యేకంగా కొన్నింటిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. లఘు నారికేళం అంటే అతి చిన్న కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా అంటారు. పేరులోనే శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీ నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న నారికేళంను పూజా గదిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏలినాటి శనితో బాధపడుతున్న వారు పూజా గదిలో, వ్యాపారంలో లాభాలు కోరుకునేవారు డబ్బు ఉంచే పెట్టెలో ఉంచితే కలిగే మార్పులను అసలు నమ్మలేరని చెబుతున్నారు.
అలాగే శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారీ అనుగ్రహం తప్పకుండ కలుగుతుందట. కానీ ఈ శ్రీసూక్తం తప్పులు లేకుండా సరిగ్గా చదవక పోతే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అందుకే ముందుగా శ్రీసూక్తాన్ని పండితుల దగ్గర స్వర సహితంగా నేర్చుకుంటే మంచిదట. లేదంటే తరచుగా ఈ శ్రీ సూక్తం ని విన్నా కూడా అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. శ్రీ చక్రం.. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకు చిహ్నంగా చెబుతుంటారు. అంతేకాదు శ్రీ చక్రంలో త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒక మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీ చక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారం అని పిలుస్తారు.
ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీ యంత్రాన్ని కానీ పూజ గదిలో ఉంచితే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెబుతున్నారు. అలాగే లక్ష్మికి తామర పూలు అంటే చాలా ఇష్టం. లక్ష్మి అమ్మవారు కూడా తామర పువ్వు పై కూర్చుని కనిపిస్తూ ఉంటారు. శంఖం, గవ్వలు, తామర పువ్వులతో పూజిస్తే అమ్మవారిని పూజిస్తే మంచిదని చెబుతున్నారు. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరపూలతో ఆ సిరుల తల్లిని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందట. అదేవిధంగా పూజామందిరంలో శంఖాన్ని ఉంచి ప్రతిరోజు నిత్యపూజ తరువాత శంఖాన్ని పూరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందట. అలాగే ప్రతి శుక్రవారం శంఖాన్ని పారిజాత పూలతో పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.