Gadapa: ప్రధాన ద్వారం వద్ద ఉండే గడప మీద కాలు పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే గడపను కాలితో తొక్కితే ఏం జరుగుతుందో దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:30 PM, Wed - 21 May 25

ఇంటి గడప అంటే లక్ష్మిదేవితో సమానం. అందుకే గడపను కాలితో తన్నడం, తొక్కడం, గడపపై కూర్చోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఇంటి నిర్మించే ముందు ఇంటి గుమ్మానికి ఎదురుగా పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటికి ప్రధాన గుమ్మం ఎదురుగా ఎప్పుడూ కూడా నిలువు స్తంభం ఉండకూడదట. వాస్తు ప్రకారం ఇలా నిలువ స్తంభం ఉండడం వల్ల ఇంట్లోని స్త్రీ అనారోగ్య సమస్యలకు గురవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఇంటి ముందు మెట్లు కట్టకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఇంట్లోని వ్యక్తులకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుందట. ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు ఉండకూడదట. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు ఉంటే ఇంట్లోనే వ్యక్తుల ఆటంకాలు ఏర్పడతాయట. అందుకే ఇంటికి ఎదురుగా ఈ మూడింటిని అసలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి గుమ్మం మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అలాగే గుమ్మం దగ్గర గోర్లు కత్తిరిస్తూ ఉంటారు. మరికొందరు అక్కడే కూర్చుని తల దువ్వుతూ ఉంటారు.
ఇలా గుమ్మం దగ్గర ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట. అందుకే ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ విధమైనటువంటి పనులు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం సమయంలో గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుందట. అలాగే గుమ్మంని పొరపాటున కూడా తొక్కకూడదట. గుమ్మాన్ని తొక్కితే లక్ష్మి దేవికి కోపం వస్తుందట.