Astrology: ఇంట్లోని ఆ ప్రదేశాల్లో ఈ గుర్తు ఉంటే చాలు.. లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులవడం ఖాయం!
ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తును వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Thu - 13 February 25

హిందూ సంప్రదాయంలో ఓంకారం గుర్తు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. చాలా రకాల శుభకార్యాలకు ఈ స్వస్తిక్ గుర్తుని గీస్తూ ఉంటారు. ముఖ్యంగా గృహప్రవేశం సమయంలో ఈ స్వస్తిక్ గుర్తుని ఇంట్లోనే గోడలకు బయట డోర్ కి రాస్తూ ఉంటారు. దీనివల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతూ ఉంటారు. ఈ గుర్తును ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో వేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయట. మరి ఇంట్లో ఈ గుర్తును ఎక్కడెక్కడ వేయాలో ఎక్కడ వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొదటగా మీ ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ మీద స్వస్తిక్ గుర్తు ఉండాలి. మీరు కుంకుమతో ఆ గుర్తు వేసుకోవచ్చు. లేదంటే.. అందుకు సంబంధించిన స్టిక్కర్ మెయిన్ ఎంట్రెన్స్ మీద అతికించినా చాలా మంచిదని చెబుతున్నారు. ఇలా ఈ గుర్తును మెయిన్ డోర్ దగ్గర వేయడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయట.
అలాగే ఇంట్లో తలుపుల మీద ఈ గుర్తులు ఉన్నా, స్టిక్కర్ లు అతికించినా లక్ష్మి కటాక్షం కలుగుతుందట. అదేవిధంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు గీసినా స్టిక్కర్ అతికించినా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయట. వృథా ఖర్చులు తగ్గిపోతాయని చెబుతున్నారు.
డబ్బు దాచుకునే బీరువా మీద కూడా ఈ గుర్తు ఉండడం చాలా మంచిదట. కాబట్టి బీరువాపై కుంకుమతో ఈ సింబల్ వేసుకున్నా కూడా లేదంటే స్టిక్కర్ అతికించినా వృథా ఖర్చులు తగ్గి సంపాదన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా పూజా మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు ఉండాలట. ఆ గదిలోని గోడపైన ఎర్రటి గుర్తుతో ఈ సింబల్ వేసుకుంటే చాలా శుభప్రదమని చెబుతున్నారు. వంట గదిలో కూడా ఈ స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. పంట గదిలో గ్యాస్ స్టౌ ఎదురుగా ఉన్న గోడ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలట. ఆపై దానికి నాలుగు వైపులా కుంకుమ బొట్టు పెట్టి రెండు నిలువు గీతలు ఎడమ వైపు, మరో రెండు గీతలు కుడి వైపు పసుపుతో గీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవిస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే ఆహారానికి ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదట. ఇంటికి ఆగ్నేయం దిశ చాలా ముఖ్యమైనది. ఆ దిశలో అగ్నిదేవుడు ఉంటాడు. లక్ష్మీదేవి ఎప్పుడూ అగ్నిదేవుడి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం శ్రీం, కాబట్టి ఇంట్లో ఆగ్నేయ మూలలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయాలి. ఆ ఇంట్లో వృథా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుందట.