Plants: మీ పెరట్లో కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయా.. జీవితం నాశనం అవ్వడం ఖాయం!
మనం పెరట్లో పెంచుకునే కొన్ని రకాల మొక్కల వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు. వాటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.
- By Anshu Published Date - 10:35 AM, Mon - 3 February 25

మామూలుగా మనం ఇంట్లో అలాగే పెరట్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. అందులో కొన్ని మొక్కలు మనకు మేలు చేస్తే ఇంకొన్ని మొక్కలు ఇంటికి నెగటివ్ ఎనర్జీని కూడా తెచ్చి పెడతాడట.అందుకే ఇంట్లో అన్ని రకాల మొక్కలను నాటకూడదట. కేవలం కొన్ని మొక్కలను మాత్రమే నాటాలని చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని మొక్కలను ఇంట్లో ఆవరణలో పెంచడం వల్ల నెగటివ్ ఎనర్జీని ఆకర్షించినట్టు అవుతుందని చెబుతున్నారు. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయట. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలను పెంచకూడదు అన్న విషయానికి వస్తే..
చాలామంది ఇంటి ఆవరణలో నీడ కోసం లేదా చింతచిగురు, చింతకాయల కోసం చింత చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అయితే చాలామంది రాత్రిపూట చింత చెట్లు దెయ్యాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. అందుకే చాలా వరకు ఈ చింతచెట్టును పెంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఈ చెట్టు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండటం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయట. సంతోషంగా ఉండాలి అనుకున్న వారు ఈ చెట్టు పెంచకపోవడమే మంచిది అని చెబుతున్నారు. అలాగే రబ్బరు కోసం చాలామంది ఇంట్లో రబ్బరు మొక్కను పెంచుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మొక్క వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. అలాగే ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇంట్లో కూడా కష్టాలు ఏర్పడతాయట.
అలాగే ఇంటి ఆవరణ ప్రాంతంలో బ్రహ్మజెముడు మొక్కను కూడా నాటకూడదని చెబుతున్నారు. ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉండడం వల్ల కలహాలు వస్తాయట. తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందట. ఏదో విధంగా గొడవలు పెరుగుతూనే ఉంటాయని సంతోషం ఉండదని అందుకే ఈ మొక్కను ఇంటి వద్ద పెంచుకోవద్దు అని పండితులు చెబుతున్నారు. ఇంటి వద్ద పెంచుకోకూడని మొక్కలలో తుమ్మ చెట్టు కూడా ఒకటి. తుమ్మచెట్టు పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయట. ఎంత సంపాదించినా కూడా డబ్బు ఇంట్లో నిలవదని చెబుతున్నారు. అలాగే కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయట..ఈ చెట్టును ఇంట్లో పెంచకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు. కొందరు అందం కోసం ముళ్ల మొక్కలను పెడుతుంటారు. అయితే వీటి వల్ల ఇంట్లో అసౌకర్య వాతావరణం ఉంటుంది. ప్రతికూల శక్తులు ఉంటాయని చాలా మంది భావిస్తారు. ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.