Spiritual: ఈ 5 రకాల వస్తువులు మీ ఇంట్లో ఉంటే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
Spiritual: ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల వస్తువులు మీ ఇంట్లో ఉంటే అంతా మంచే జరుగుతుందని, డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 AM, Sun - 7 December 25
Spiritual: మీరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవాలని చెబుతున్నారు. అవేంటి అన్న విషయానికి వస్తే.. అందులో మొదటిది దక్షిణవర్తి శంఖం. క్షీరసాగర మథనం సమయంలో ఈ శంఖం ఉద్భవించిందట. ఈ అరుదైన శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం సానుకూల శక్తిని, శ్రేయస్సును ఆకర్షిస్తుందని చెబుతున్నారు. ఇది కుడి చేతి శంఖం కాబట్టి ఇది ప్రత్యేకమైనదని చెబురున్నారు. శుక్రవారం నాడు దక్షిణవర్తి శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆర్థిక లాభాలు వస్తాయట. రెండవ వస్తువు శ్రీ యంత్రం.
ఈ శ్రీ యంత్రంని లక్ష్మీదేవి దైవిక చిహ్నంగా భావిస్తారు. సంపద, సమృద్ధిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. శుక్రవారం నాడు శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేసి సరైన ఆచారాలతో పూజించడం వల్ల దేవత నుండి నిరంతర ఆశీర్వాదాలు లభిస్తాయట. ఇంటి ఈశాన్యంలో దీన్ని ప్రతిష్టించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. మూడవ వస్తువు కౌరీ గవ్వలు. సముద్రం నుండి ఉద్భవించే గవ్వలు కూడా లక్ష్మీ దేవికి ఇష్టమైనవి. శుక్రవారం నాడు గవ్వలను కొనుగోలు చేసి దేవతకు సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుందట. మీ పర్సులో ఈ గవ్వలను ఉంచుకోవడం వల్ల సంపద వస్తుందట. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయని చెబుతున్నారు.
కమలం పువ్వు.. లక్ష్మీదేవికి కమలం ఎంతో ఇష్టం. ఆమె దానిపై కూర్చుని ఉంటుంది. శుక్రవారం నాడు కమలం పువ్వును కొని పూజ సమయంలో సమర్పించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు పెరుగుతాయట. కమలం స్వచ్ఛత, శ్రేయస్సును కూడా సూచిస్తుందట. అదేవిధంగా శుక్రవారం నాడు వెండి కొనడం చాలా అదృష్టంగా పరిగణించబడుతుందట. మీరు ఈ రోజున వెండిని కొనుగోలు చేస్తే, దానికి తిలకం వేసి మీతో ఉంచుకోవాలట. చాలా మంది తమ పర్సులలో ఉంచడానికి చిన్న వెండి నాణేలను కూడా కొనుగోలు చేస్తారు. అయితే శుక్రవారం నాడు వెండిని దానం చేయకూడదట. ఎందుకంటే అది శుక్రుని ప్రభావాన్ని బలహీనపరుస్తుందని చెబుతున్నారు.