Mystery Temple: దెయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన మిస్టరీ ఆలయం గురించి తెలిస్తే షాక్ అవడం ఖాయం!
అప్పటివరకు మీరు అనేక ఆలయాలు రహస్యాల గురించి మిస్టరీల గురించి తెలుసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ప్రత్యేకత కాస్త వేరే అని చెప్పాలి. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:00 PM, Fri - 9 May 25

మామూలుగా ఆలయాలను నిర్మించడం మనం చూసే ఉంటాం. ఇప్పటికీ ఇదే జరుగుతోంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయాన్ని మాత్రం ఏకంగా దెయ్యాలు నిర్మించాయట. అది కూడా రాత్రికి రాత్రే నిర్మించాయని చెబుతున్నారు. ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ రహస్యం ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..కకాన్‌మఠ్ దేవాలయం సంక్లిష్టమైన డిజైన్, దాని చుట్టూ అల్లుకున్న కథల కారణంగా శతాబ్దాలుగా సందర్శకులను ఆకర్షింపజెస్తోంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే దీనిని దెయ్యాలు రాత్రికి రాత్రే నిర్మించాయని స్థానికులు నమ్ముతున్నారు. కకాన్‌మఠ్ దేవాలయాన్ని అతీంద్రియ శక్తులు ముఖ్యంగా దెయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయట.
దెయ్యాలు ఎక్కడెక్కడి నుండో పెద్ద పెద్ద రాళ్లను తెచ్చి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించాయని చెబుతున్నారు. ఇందులో నిజాల సంగతి పక్కన పెడితే.. ఆలయం గురించి విన్న ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా పురాతన దేవాలయాల నిర్మాణంలో సిమెంట్, సున్నం లేదా ఇతర బంధన పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ కకాన్‌మఠ్ దేవాలయం విషయంలో అలా జరగలేదు. ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, ఎటువంటి సిమెంట్ లాంటి పదార్థం ఉపయోగించకుండానే ఆలయాన్ని నిర్మించారట.
ఈ రాళ్ల పేర్పు ఎంత ఖచ్చితంగా ఉందంటే నేటికీ ఆ రాళ్లు కదలకుండా ఒకదానిపై ఒకటి నిలబడి ఉన్నాయట. ఈ నిర్మాణం వెనుక ఉన్న రహస్యం నేటికీ ఎవరికీ తెలియదు. ఇది ఇంజనీరింగ్ లకు కూడా అద్భుతంగా కనిపిస్తుందట. కాగా ఈ దేవాలయం నిర్మించి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్న కూడా చెక్కు చెదరకుండా నిలబడి ఉండటం వెనుక కారణం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. కొందరు దీనిని దేవుని మహిమ అంటారు. మరికొందరు దీనిని నిర్మాణ నైపుణ్యం అంటారు. రాళ్లను పేర్చడంలో గల నైపుణ్యం, ఖచ్చితత్వం వల్లనే ఇది సాధ్యమైందని కొందరు వాదిస్తారు. అయితే దీని వెనుక అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కకాన్‌మఠ్ దేవాలయం నేటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.