Sunday: ఆదివారం రోజు ఇప్పుడు చెప్పినట్టు పూజ చేస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు!
Sunday: సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైన ఆదివారం రోజున ఇప్పుడు చెప్పినట్టుగా పూజలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి ఈ రోజున ఎలాంటి పూజా విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Fri - 7 November 25
Sunday: ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. అయితే ఈ రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని నమ్మకం. అలాగే ఈ రోజున పూజ చేయడం వల్ల ఆరోగ్యం, శాంతి, కీర్తి లభిస్తాయని నమ్ముతారు. ఈ పూజలో భాగంగా సూర్యుడికి నీరు సమర్పించడం, ఆర్ఘ్యం ఇవ్వడం, మంత్రాలు చదవడం, దానం చేయడం వంటివి ప్రత్యేక ఫలితాలను అందిస్తాయి.
అయితే ఇంతకీ ఆదివారం రోజు ఏం చేయాలి? పూజా విధానం ఎలా అన్న వివరాల్లోకి వెళితే.. ఆదివారం రోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నీరు సమర్పించాలట. ఇలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు “ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్యాయ నమః” వంటి మంత్రాలను జపించాలట. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. అదేవిధంగా ఆదివారం రోజున బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగు వస్త్రాలు, రాగి పాత్రలు వంటివి పేదలకు దానం చేయాలట. కొందరు ఆదివారం ఉపవాసం ఉంటారు.
సూర్యాస్తమయం తర్వాత ఉప్పు, నూనె లేని భోజనం చేస్తారు. మరుసటి రోజు ఉదయం సూర్యుడికి నీరు సమర్పించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు.
కాగా దివారం నాడు సూర్యుడిని పూజించడం వల్ల ఆరోగ్యం, శక్తి, విజయం లభిస్తాయట. జాతకంలో సూర్యుడి స్థానం బలంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే ఇంట్లో శాంతి, కీర్తి లభిస్తాయట. దుష్ట శక్తులు తొలగిపోయి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఆదివారం రోజు మద్యపానం, మాంసం వంటి వాటికీ దూరంగా ఉండాలట.