Pooja Room: పూజ గదిలో పొరపాటున కూడా వీటిని అస్సలు పెట్టకండి.. పూజ ఫలితం కూడా దక్కదు?
మాములుగా హిందువుల ఇండ్లలో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. కొందరు పూజ చెయ్యడానికి చిన్న స్థలం అయినా ప్రత్యేకంగా పెట్టుకుంటారు. కాగా ఇంట్లోని పూజ గదిలో వారికీ ఇష్టమైన దేవతల ఫోటోలు,
- By Anshu Published Date - 10:15 AM, Tue - 16 July 24

మాములుగా హిందువుల ఇండ్లలో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. కొందరు పూజ చెయ్యడానికి చిన్న స్థలం అయినా ప్రత్యేకంగా పెట్టుకుంటారు. కాగా ఇంట్లోని పూజ గదిలో వారికీ ఇష్టమైన దేవతల ఫోటోలు, విగ్రహాలను ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే ఇంట్లోని పూజ గదిలో ముఖ్యంగా ఎలాంటి విగ్రహాలు, ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి అన్న విషయం చాలా మందికి తెలియదు. మరి పూజ గదిలో ఎలాంటివి పెట్టుకోవాలి, ఎలాంటివి పెట్టుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ గదిలో దేవుడి విగ్రహాలు,ఫొటోలు, పూజా సామగ్రి తప్ప మరేమీ కనిపించకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని గదిలో కొన్ని విగ్రహాలను ఉంచకూడదు.
అలాంటి విగ్రహాలు పెట్టినా, ఆ గదిలో ఎంత పూజ చేసినా పూజలు చేసిన వారికి ఫలితం దక్కదు అంటున్నారు పండితులు. వాస్తు ప్రకారం పూజ గది ఇంట్లో ఈశాన్య మూలలో ఉండాలి. లేదంటే తూర్పు లేదా పడమర దిశలో పెట్టవచ్చు. కానీ ఉత్తరం లేదా దక్షిణం వైపు ఎప్పుడు పూజ గది ఉండకూడదు. అయితే ఇంటి వాస్తు ప్రకారం ఉత్తరం వైపు పూజ గది పెట్టుకోవడం కొందరికి మంచిదే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే పూజా గదిలోని విగ్రహాలు సరైన క్రమంలో ఉండాలి. పూజ గదిలో ద్రుష్టి దేవుని విగ్రహాలను ఇంట్లోని పూజా గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే పూజా గదిలో ఏదైనా దేవత విగ్రహాన్ని అసంతృప్తి లేదా కోపంతో ప్రతిష్టించడం వల్ల మనస్సులో అశాంతిని సృష్టిస్తుంది. అది క్రమంగా ఇంట్లో గొడవలకు దారితీస్తుంది. పూజ గదిలో కాళి, భైరవ, రాహు కేతు ఉగ్ర దేవతల విగ్రహాలు, ఫోటోలు అస్సలు ఉంచకూడదు.
శని దేవుడు అందరికి న్యాయాధిపతి అని అంటారు. ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం అవసరమని అంటున్నారు. అయితే ఇంట్లో శని విగ్రహాన్ని అస్సలు పూజించకూడదు. ఇంట్లోని పూజా గదిలో ఉంచడం అశుభంగా భావించాలి. ఇంటి వాస్తు ప్రకారం ఫోటో లేదా విగ్రహంలో ఏ మూల శనిని ఉంచాలి అన్న విషయంలో పండితుల సలహా తీసుకోవడం మంచిది. అదేవిధంగా శాస్త్రం ప్రకారం ఇంట్లో నరసింహ విగ్రహాన్ని పూజించకూడదట. ఉగ్రరూప అవతారం ఇంట్లో కలహాలు, చికాకులు కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు పండితులు. అలాగే ఇంట్లో పూజా గదిలో శివుడి విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు. కానీ నటరాజ మూర్తిని ప్రతిష్ఠించకూడదట. ఈ విగ్రహం శివుని మహిమను తెలియజేస్తుందట.
ఇది ఇంట్లో కలహాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా బొమ్మ ఉంచుతారు. ఇంట్లో కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోని ఉంచడం మనకు చాలా మంచిది. మీ ఇంటి పూజా గదిలో పొరపాటున కూడా నిలబడి ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహం ఉంటే ఎవరైనా అనారోగ్యానికి గురవుతారని పెద్దలు నమ్ముతారు. పూజ గదిలో విరిగిన విగ్రహాన్ని, చినిగిపోయిన, పగిలిపోయిన ఫోటోలు ఉంచవద్దు. వెంటనే ఇంటి నుండి అలాంటి విగ్రహాలు, ఫోటోలను బయటకు పారేయడం మంచిది.