Navagraha Pooja:వారంలో ఏ రోజు శుభం ఏ రోజు అశుభమో తెలుసా..?
వారానికి ఏడు రోజులు. ఈ ఏడు రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే కొన్ని రోజులను కొంతమంది
- By Nakshatra Published Date - 07:00 AM, Sun - 17 July 22
వారానికి ఏడు రోజులు. ఈ ఏడు రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే కొన్ని రోజులను కొంతమంది శుభంగా భావిస్తే మరికొన్ని రోజులను కొంతమంది అశుభంగా భావిస్తూ ఉంటారు. మరి ఏ ఏ రోజుకి ఏ దేవుడు అధిపతి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆది అంటే మొదటిది అని అర్థం. మొదటగా లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడే కాబట్టి ఆదిత్యుడే ఆదివారానికి అధిపతి. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోముడంటే అమృతాన్ని పుట్టించేవాడు అని అర్థం. చంద్రుడి వెన్నెల అమృతంలా ఎన్నో ఓషధులను బతికిస్తోంది. భూలోకానికి అమృత కిరణాలు ప్రసాదిస్తాడు చంద్రుడు. అందుకే సూర్యుడి తర్వాత భూలోకానికి చంద్రుడే ప్రాణప్రదాత. మనశ్సాంతికి చంద్రుడిని పూజిస్తారు.
మంగళవారం ఈ రోజుకి అధిపతి కుజుడు. కుజఅంటే భూమి నుంచి పుట్టినవాడు అని అర్థం. ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు. అంగారం అంటే నిప్పు. నిప్పులా ఎర్రగా ఉంటాడు కనుక అంగారకుడు. మంగళం అంటే శుభమే కదా అందుకే కుజుడుని ఆరాధిస్తే శుభం కలుగుతుందట. బుధవారానికి అధిపతి అయిన బుధుడు చంద్రుడి పుత్రుడిగా చెబుతారు. బుధుడు అంటే సర్వం తెలిసినవాడు, జ్ఞాని, పండితుడు అని అర్థం. అయితే సర్వం తెలిసినా బుధుడు స్వయంగా ప్రవర్తించడంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. బుధుడు ఏ గ్రహంతో సన్నిహితంగా ఉంటాడో, ఆ గ్రహానికి సంబంధించిన గుణాలే బుధుణ్ని అంటుకుంటాయని చెబుతారు.
గురువారం అసలు పేరు బృహస్పతి అయినా దేవతలకు గురువు అయిన కారణంగా బృహస్పతికి గురువు అని పిలుస్తారు. బుద్ధికుశలతకు మారుపేరైన బృహస్పతి సంచారం జాతకంలో బావుంటే సకల విద్యలూ అలవడతాయని విశ్వాసం. శుక్రవారం రాక్షసుల గురువు శుక్రాచార్యుడు శుక్రవారానికి అధిపతి. మృత సంజీవని తెలిసినవాడు.
శనివారం శనివారానికి అధిపతి శనైశ్చరుడు. శని గమనం మెల్లగా ఉంటుంది కాబట్టే మందుడు అని కూడా అంటారు. ఛాయా సూర్యుల కుమారుడు యమధర్మరాజు యమున సోదరుడు. అన్న యమధర్మరాజు మరణం తర్వాత శిక్షిస్తే, తమ్ముడు శని బతికి ఉండగానే పాప పుణ్యాల లెక్కలు సెట్ చేస్తాడు. అందుకే శనిని ఆరాధిస్తే చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని విశ్వాసం. ఇలా ఏడువారాలు రోజుకొకరు చొప్పున మన జీవితాల్లో నిత్యం దర్శనమిస్తుంటారు. నిత్యం వారిని తలుచుకుని పూజ చేస్తే ఆయా గ్రహాల అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా తలపెట్టిన పనిబట్టి ఏ రోజు చేయాలి, ఏ రోజు వద్దు అనేది ఆధారపడి ఉంటుంది.
Tags
Related News
Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్‌కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.