Solar Eclipse : సూర్యగ్రహణానికి 2 రోజుల ముందు తులసి చెట్టు దగ్గర ఈ పనిచేయకండి..పాపం మూటగట్టుకున్నట్లే..!!
సూర్యగ్రహణానికి 12గంటల ముందు నుంచే సూతకం ప్రారంభం అవుతుంది. సూతకం ప్రారంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు అది శుభసమయం కాదు.
- Author : hashtagu
Date : 23-10-2022 - 9:43 IST
Published By : Hashtagu Telugu Desk
సూర్యగ్రహణానికి 12గంటల ముందు నుంచే సూతకం ప్రారంభం అవుతుంది. సూతకం ప్రారంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు అది శుభసమయం కాదు. కాబట్టి ఈ సమయంలో పూజలు, ఇతర కార్యక్రమాలు అన్నీ నిషేధం. తినడం, తాగడం కూడా నిషేధం. సూతకం ప్రారంభమైన వెంటనే ఆలయాలు మూసుకుంటాయి. అయితే సూతకానికి ముందే తులసి ఆకులను ఆహారం, పానీయాలలో ఉంచుతారు.
హిందూమతంలో తులసిని భగవంతునితో సమానంగా భావించి పూజిస్తారు. ప్రతిఇంటి ఆవరణలో తులసిమొక్కను నాటి పూజిస్తుంటారు. శుభకార్యంలో తులసి ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుళ్లకు ఏదైనా నైవేద్యం సమర్పించే సమయంలో కూడా తులసి ఆకులను వేస్తారు. ఈ సారి దీపావళి సందర్భంగా సూర్యగ్రహణం ఏర్పాడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం అక్టోబర్ 25వ తేదీన ఏర్పడుతుంది. దీపావళి మరుసటి రోజు. ఆరోజు ఆహారం, పానీయాల స్వచ్చతను కాపాడుకునేందుకు తులసి ఆకులను వేస్తుంటారు. కానీ సూర్యగ్రహానికి రెండు రోజుల ముందు తులసిని తాకకూడదని శాస్త్రాలు చెబతున్నాయి. ఆకులను తెంపడం అరిష్టమని చెబుతోంది.
తులసి ఆకులను తెంపడం…
సూర్యగ్రహానికి ముందు తులసి ఆకులను తెంపడం బహ్మను చంపిన పాపం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అక్టోబర్ 23వ తేదీ ఆదివారం నుంచి తులసిను ముట్టుకోవడం, ఆకులను తెంపడం నిషేధం. ఈరోజుల్లో తులసి ఆకులను తెంపినట్లయితే మహాపాపం మూటగట్టుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆదివారం రోజు 12 గంటల లోపు తులసి ఆకులను తీసుకోవచ్చు. 12 గంటల తర్వాత తులసిని ముట్టకూడదు.