Kartika Masam : కార్తీకమాసం ఎప్పటి నుంచి ? శివకేశవుల అనుగ్రహం కోసం ఏం చేయాలి ?
Kartika Masam : ‘‘కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు” అని స్కంద పురాణం చెబుతోంది.
- Author : Pasha
Date : 28-10-2023 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
Kartika Masam : ‘‘కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు” అని స్కంద పురాణం చెబుతోంది. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతకు.. బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. కార్తీక పురాణంలోని మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీ మహావిష్ణువు ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ప్రతిసంవత్సరం దీపావళి మరుసటి రోజే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది దీపావళి(నవంబరు 12) రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది. ఈసారి కార్తీకమాసం నవంబరు 14న ప్రారంభమై డిసెంబరు 13తో(Kartika Masam) ముగుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
- కార్తీమాసంలో శాకాహారం తీసుకోవాలి.
- ఈ మాసంలో పేదలకు, అనాధలకు స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవుల అనుగ్రహం లభిస్తుంది.
- దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి.
- ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి.
- దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకూడదు.
- మినుములు తినకూడదు.
- నలుగుపెట్టుకుని స్నానం చేయకూడదు.
- కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు
Also Read: Chicken Sweet Corn Soup : చికెన్ స్వీట్ కార్న్ సూప్ టేస్టీగా ఇలా చేసుకోండి.. చలికాలంలో వేడివేడిగా..
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.