Betel Leaves: హిందూ వివాహాల్లో తమలపాకును ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా?
హిందూ సంప్రదాయంలో ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా తమలపాకులు తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అందులోనూ పెళ్లిలో తమలపాకు ఎంతో కీల
- Author : Anshu
Date : 02-07-2024 - 7:41 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూ సంప్రదాయంలో ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా తమలపాకులు తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అందులోనూ పెళ్లిలో తమలపాకు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. పెళ్లి కూతురు మండపంలో అడుగుపెట్టడానికి చేతిలో తమలపాకుతో ఉన్న తాంబూళం ఉండాలి. ఆఖరికి జిలకర బెల్లాన్ని కూడా తమలపాకుతో కలిపే పెడతారు. అలాగే ఇతరులకు తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తమలపాకు కు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాలు అంటే పూలు అక్షింతలు, ఫలాలు, అద్దం, వస్త్రం, తమలపాకు వక్క ,దీపం, కుంకుమ. కలశ పూజలో సంప్రోక్షణలు చేసే సమయంలో తమలపాకుని ఉపయోగిస్తారు. పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం. భారత దేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజ చేసేటప్పుడు అలాగే దక్షిణ ఇచ్చేటప్పుడు పిల్లలలో భోజనం తర్వాత తీసుకునే కిల్లిలలో కూడా ఈ తమలపాకుని వినియోగిస్తూ ఉంటాం. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.
అలాగే ప్రతీ ఒక్కరూ క్షీర సాగర మథనం గురించి కూడా వినే ఉంటారు. స్కాంద పురాణం ప్రకారం క్షీర సాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటి. కొన్ని జానపద కధల ప్రకారం శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని నమ్ముతుంటారు. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ ఉంటారట. అందుకే తమలపాకుకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా బంధాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ తమలపాకును ఉపయోగిస్తే వారికి మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే కచ్చితంగా పెళ్లిలో వీటిని ఉపయోగిస్తారు. హిందూ పెళ్లిలో జిలకర బెల్లం పెడితే దాదాపు పెళ్లి అయిపోయినట్లే అని అంటుంటారు.
అలాంటి జిలకర బెల్లాన్ని తమిళపాకులో ఉంచే పెడతారన్న విషయం తెలిసిందే. ఇక బెంగాళీ పెళ్లిలో అయితే.. వధువుని ఆమె సోదరులు తీసుకువస్తుండగా ఆమె తన ముఖాన్ని రెండు తమలపాకులతో కనిపించకుండా ముఖానికి అడ్డుగా పెట్టుకుంటుంది. ఆ తర్వాత వరుడు ముందు కూర్చొని వాటిని తొలగించి పెళ్లి కొడుకును చూస్తుందట. అలా చేస్తే అదృష్టం కలుగుతుందని వారి నమ్మకం. అదేవిధంగా రాజస్థానీ పెళ్లిలో కూడా వధువు కుటుంబం వరుడు కుటుంబానికి భోజనాలు వడ్డించాలి. ఈ సాంప్రదాయం ఎప్పటినుంచో వస్తోంది. అయితే ఆ భోజనంలో తప్పకుండా తమలపాకు ఉండాలట..