Coconut: గుడిలో కొబ్బరికాయ కొట్టేముందు ఈ నియమాల గురించి తెలుసుకోవాల్సిందే!
కొబ్బరికాయ కొట్టే ముందు కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:15 PM, Thu - 19 September 24

మనం భగవంతుడికి పూజ చేసిన తర్వాత, పూజ మొత్తం పూర్తి అయ్యాక కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. కొబ్బరికాయ కొడితే ఆ పూజ పూర్తి అయినట్లు మనం భావిస్తూ ఉంటాం. కాగా భగవంతుని పూజలో భాగంగా దేవుడికి కొబ్బరి కాయ కొట్టడం అన్నది హిందూ సంప్రదాయంలోని ఆచారం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మరి కొబ్బరికాయ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఎప్పుడూ కూడా తొమ్మిది అంగుళాల ఎత్తు నుంచి కొట్టడం మంచిది.
కొబ్బరికాయ కొట్టినప్పుడు రెండు భాగాలుగా పగలా లని, కాస్త అటు ఇటుగా వంకరటింగా పగలకూడదని చాలామంది అంటూ ఉంటారు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా కుళ్లిపోయినట్టు ఉంటుంది. అయితే అలాంటప్పుడు అదేదో అశుభం అని దిగులు పడనక్కర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవట. ఒకవేళ టెంకాయ కుళ్ళిపోతే ఆ సమయంలో శివాయనమః అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుందట. అలా కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు కలిగే ఎలాంటి దోషాలు అయినా ఆ మంత్రం జపిస్తే పోతాయని చెబుతున్నారు. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు సగానికి మాత్రమే పగలాలని ఏమి లేదని, అలాంటి నియమాలు కూడా ఏమీ లేవని చెబుతున్నారు పండితులు.
చాలా మంది టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు. కానీ ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదట. అభిషేకం చేయాలి అనుకున్న వారు కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోకి తీసుకొని ఆ కాయను వేరు చేసి వేరు వేరు ఉంచాలట. ఆ తర్వాత పాత్రలోని కొబ్బరి నీటిని మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలని నేరుగా కొట్టిన కొబ్బరికాయ మీ అభిషేకానికి ఉపయోగించకూడదని చెబుతున్నారు. అలాగే వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలట. కొబ్బరికాయ కొట్టే ముందు జుట్టు దేవుడి వైపు ఉండే విధంగా పట్టుకొని కోరికను కోరి ఆ తర్వాత టెంకాయ జుట్టు మన వైపు ఉండే విధంగా మార్చుకొని కొట్టాలట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందానికి ఉన్న పీచు తీసేసి కొబ్బరి కొబ్బరి చిప్పలు వేరువేరుగా ఉంచాలని చెబుతున్నారు.