Bhishma Ashtami: భీష్మాష్టమి ఎప్పుడు…దాని ప్రత్యేకత ఏమిటి..?
భీష్మాష్టమి....హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షం అష్టమి తిథి రోజున తన శరీరాన్ని వదిలి వెళ్లాడు.
- By Hashtag U Published Date - 10:05 AM, Thu - 10 February 22

Bhishma Ashtami: భీష్మాష్టమి….హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షం అష్టమి తిథి రోజున తన శరీరాన్ని వదిలి వెళ్లాడు. అందుకే ఈ రోజును భీష్మ పితామహుడు మోక్షం పొందినట్లుగా పండితులు చెబుతుంటారు. అందుకే ఈ రోజును భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ భీష్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున భీష్ముడికి తర్పనం సమర్పించినవారికి సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీని అనగా శుక్రవారం రోజునా భీష్మాష్టమి వస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం, ఏ ఒక్కరు కూడా తమ తండ్రి ఉన్నప్పుడు పిండాలు పెట్టేందుకు అర్హులు కారు.
కాగా భీష్మ తర్పణం విషయంలో ఆ పద్దతి మాత్రం అస్సలు పట్టించుకోరు…పాటించరు కూడా. అంతటి గొప్ప ప్రాధాన్యత భిష్ముడికి ఉంది. భీష్మ పితామహుడు గొప్ప యోధుడు. మహాభారతంలో భీష్ముని పాత్ర చారిత్రాత్మకంగా కూడా చాలా ప్రసిద్ది చెందింది. రాబోయే తరాలు కూడా భీష్ముని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా భీష్ముని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
భీష్మాష్టమి రోజున ఏం చేయాలి…
ప్రతి ఏడాది రథ సప్తమి తర్వాత భీష్మ అష్టమి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు కూడా మూడు దోసిళ్ల అర్ఝ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియను భీష్మ తర్ఫనం అని అంటుంటారు. ధర్మశాస్త్రం ప్రకారంగా భీష్మ తర్పణం, యమ తర్పణం, వంటివి తండ్రి బతికి ఉన్నవారు కూడా తప్పకుండా చేయాల్సిందే. ఇలా చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
పూజ అనంతరం….
భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తికి పూజలు జరిపిన అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాదనకు తామరవత్తులకు ఉపయోగించాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మెత్సవదర్శనం, వంటివి నిర్వహిస్తుంటారు. వీటితోపాటుగా విష్ణుపురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలుగా ఇవ్వాలని పురోహితులు చెబుతుంటారు.
భీష్ముడు కోరుకున్నప్పుడు..
పురాణాల ప్రకారంగా భీష్ముడు శంతనుడు, గంగల కుమారుడు. భీష్మ పితామహుడు తన తండ్రి శంతనుడి నుండి ఇచ్చా-ముత్యుని వరం పొందాడని, దాని ప్రకారమే అతను కోరుకున్ననాడే మరణాన్ని పొందగలడని పురాణాల్లో ఉంది. అంతేతప్ప తన ఇష్టానికి విరుద్ధంగా ఎవ్వరూ చంపలేరని పురాణాల్లో ఉంది.
భీష్మ పితామహుని ప్రాముఖ్యత గురించి…
భీష్మ పితామహుడు మహాభారతంలో కౌరవుల పక్షాన పోరాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఉత్తమ జ్ణానం, మంచి శక్తి మరియు చెడులను అర్థం చేసుకున్నప్పటికీ, తాను అంపశయ్యపై పడుకున్నప్పుడు తన నిర్ణయానికి గల హేతువును వివరిస్తాడు. తాను కౌరవులతో జీవిస్తున్నానని, వారి ఉప్పును కూడా తిన్నానని, ఉప్పు రుణం తీర్చుకోవడానికే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని భీష్ముడు వివరించారు. ఈ కారణంగా మహాభారతంలో పాండవులకు వ్యతిరేకంగా నిలిచాడు భీష్ముడు.