Shani Jayanti: నలుపు రంగు దుస్తులను దానం చేస్తే కలిగే శుభం ఇదే!
చాలామంది శనీశ్వరునికి పూజ చేసే సమయంలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. అలాగే పూజ తరువాత
- By Nakshatra Published Date - 06:30 AM, Fri - 22 July 22
చాలామంది శనీశ్వరునికి పూజ చేసే సమయంలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. అలాగే పూజ తరువాత శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను దానం చేస్తూ ఉంటారు. శనీశ్వరుడికి నల్లటి దుస్తులు, నల్లటి వస్తువులు అంటే చాలా ఇష్టమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందువల్లే శనీశ్వరుడికి ఇష్టమైన నల్ల బట్టలు, నల్ల నువ్వులు, మినప్పప్పు, నల్ల సెనగలు మొదలైన నల్ల వస్తువులను దానం చేస్తూ ఉంటారు. అయితే మరి శనీశ్వరుడికి నల్ల దుస్తులు అంటే ఎందుకు అంత ఇష్టం. అలాగే నలుపు రంగు వస్త్రాలను, వస్తువులను ఎందుకు దానం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు దక్ష ప్రజాపతి కుమార్తె సంధ్యను పెళ్లి చేసుకున్నాడు.
సంధ్య, సూర్యుడికి మను, యముడు, యమున అనే ముగ్గురు పిల్లలు సంతానం. అయితే సంధ్య దేవి సూర్యభగవానుని తేజస్సును భరించలేకపోయింది. అందుకే తన నీడకు మనిషి రూపాన్ని ఇచ్చి తన స్థానంలో ఉంచి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. సంధ్య నీడ దేవి ఛాయా రూపం,గుణంతో అచ్చం సంధ్య దేవి లాగా ఉండడంతో సూర్యభగవానుడు ఛాయ నిజానికి సంధ్య ప్రతిరూపమని తెలుసుకోలేకపోయాడు. కొంత కాలం తర్వాత దేవి ఛాయ గర్భవతి అయింది. గర్భధారణ సమయంలో ఛాయా దేవి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసేది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది. శనీశ్వరుడు చాలా నల్లగా జన్మించాడు.
పుట్టిన సమయంలో పోషకాహార లోపంతో ఉన్నాడు. నల్లని కొడుకుని చూసి సూర్య భగవానుడికి కోపం వచ్చింది. దీంతో శనిశ్వరుడిని తన కొడుకుగా అంగీకరించడానికి నిరాకరించాడు. తండ్రి నిరాదరణకు శని చాలా బాధపడ్డాడు. ఛాయా దేవి గర్భధారణ సమయంలో శివుని కోసం తీవ్రమైన తపస్సు చేసేది. అందుకే ఆమెకు శివుడి అనుగ్రహంతో శక్తి వచ్చింది. తల్లి నుంచి ఆ శక్తులు శనీశ్వరుడికి లభించాయి. అందుకనే శనీశ్వరుడు పుట్టుకతోనే శక్తులతో పుట్టాడు. అయితే తన తండ్రిని తనను బిడ్డగా అంగీకరించలేదని చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో సూర్యభగవానుడి వైపు చూశాడు. దీంతో సూర్య భగవానుడి రంగు నల్లగా మారింది. అతనికి కుష్టు వ్యాధి సోకింది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్య భగవానుడు ఆ పరమ శివుడిని క్షమించమని కోరగా తన తప్పును అంగీకరించి శని దేవుడిని గ్రహాలన్నింటిలో కెల్లా అత్యంత శక్తిమంతుడు అవుతాడని ఆశీర్వదించాడు ఆ శివుడు. నలుపు రంగును నిర్లక్ష్యం చేయడం తనని నల్లని వాడు అంటూ నిరాదరణగా చూడడంతో శనీశ్వరుడు నలుపు రంగును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు. అందుకనే శనీశ్వరుడిని పూజించే సమయంలో నల్లటి వస్తువులు ఉపయోగిస్తారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తారు. కాగా ప్రతి ఏడాది శని జయంతిని జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే.
Related News
Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం వీడియోలు, విశేషాలు ఇవిగో
Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం దృశ్యాన్ని ఉత్తర అమెరికావాసులంతా ఒక పండుగలా చూశారు.