Shani Dev: కలలో శని దేవుడు కనిపిస్తే శుభమా? అశుభమా?
Shani Dev: సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో ప్రతి కలకు కూడా ప్రత్యేకమైన అర్థం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. మన ఆలోచనలను మన నిర్ణయాలను బట్టి మనకు కలలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు
- By Anshu Published Date - 07:21 AM, Thu - 20 October 22

Shani Dev: సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో ప్రతి కలకు కూడా ప్రత్యేకమైన అర్థం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. మన ఆలోచనలను మన నిర్ణయాలను బట్టి మనకు కలలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అదేవిధంగా మనకు వచ్చే కొన్ని కలలకు శని దేవునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంటుందట. మరి కలలో శని దేవుని విగ్రహం కానీ శని దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది. అలా కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు వచ్చే కల లలో రెండు రకాల కలలు ఉంటాయి.
ఒకటి భవిష్యత్తులో జరగబోయే అంశాలు, రెండు గతంలో జరిగిన అంశాలు ఈ రెండు అంశాల ఆధారంగా మనకు కలలు వస్తూ ఉంటాయి. కాగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయట. ఇక కొన్ని కలలకు శని దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉంటుందట..మీకు శని దేవుడికి సంబంధించిన కలలు వస్తున్నాయంటే మీ జీవితంలో ఏవో మార్పులు జరగబోతున్నాయని అర్థం. శని దేవుడు మీ పట్ల దయ చూపడం లేదా మీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆ కలలు సంకేతం. ఒకవేళ మనకు కలలో శని దేవుడి విగ్రహం లేదా చిత్రం కనిపిస్తే మీకు మంచి రోజులు రానున్నాయి అని అర్థం.
అదేవిధంగా జాతకంలో శని స్థానాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. కొంతమందికి శని దేవుడి విగ్రహం కలలో కనిపిస్తే లేని ఇబ్బందులు ఎదురవొచ్చు. కలలో శని దేవుడు నేరుగా వచ్చి అనుగ్రహించినట్లయితే ఆ కల చాలా శుభంగా చెప్పవచ్చు. అలా శని దేవుడు నేరుగా కలలోకి వస్తే మీ జీవితంలో ఉండే అష్ట కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ఇస్తారు అని అర్థం. ఒకవేళ కలలో శని దేవుని ఆలయం కనిపిస్తే భావించవచ్చు. అటువంటి వ్యక్తులు త్వరలోనే శని దేవుని అనుగ్రహాన్ని పొందబోతున్నారని అర్థం. శని దేవాలయం కలలో కనిపించడం ధన లాభానికి సంకేతం.