Ash Gourd: ఏ రోజు ఏ సమయంలో దిష్టి గుమ్మడికాయ కడితే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు షాపుల ముందు కట్టడం మంచిదే కానీ, ఎప్పుడు కట్టాలి? ఏ సమయంలో కట్టాలి? కట్టే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.
- By Anshu Published Date - 10:00 AM, Mon - 28 April 25

బూడిద గుమ్మడికాయ వల్ల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బూడిద గుమ్మడికాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ముఖ్యంగా దిష్టి తీయడం కోసం బూడిద గుమ్మడికాయను ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు ఇంటిముందు అలాగే బిజినెస్ ల దగ్గర గుమ్మడికాయను కడుతూ ఉంటారు. బూడిద గుమ్మడి కాయను షాపుల ముందు, ఇంటి ముందు కట్టడం వల్ల నర దిష్టి తొలగిపోతుందని, ద్రుష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మకం. బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం మంచిదే కానీ, కట్టే ముందు కొన్ని రకాల విషయాలు గుర్తుంచు కోవడం తప్పనిసరి. మరి ముఖ్యంగా బూడిద గుమ్మడికాయను ఏ సమయంలో ఏ రోజు కట్టాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలట. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బూడిద గుమ్మడికాయను ఎప్పుడైనా సరే అమావాస్య రోజు కట్టాలట. అమావాస్య రోజు అది కూడా సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మ కాయను ఇంటి ముందు కట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతానని అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా బుధవారం,శనివారం వంటి రోజుల్లో కూడా బూడిద గుమ్మడికాయను కట్టవచ్చట. ఎప్పుడు కట్టినా సరే సూర్యోదయానికి ముందు కడితే మంచి ఫలితాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.
సూర్యాస్తమయం తరువాత బూడిద గుమ్మడికాయ ను కట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవని, సూర్యాస్తమయం తరువాత కట్టిన బూడిద గుమ్మడికాయ వల్ల ఎలాంటి ఫలితాలు కలగవట. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడం వల్ల కాలభైరవుడు ఇంటికి రక్షణగా ఉంటాడట. ఇంటికి నరదృష్టి అలాంటివి తగలవని చెబుతున్నారు. ఇంటికి వచ్చే చెడు శక్తులు ఇవన్నీ కూడా గుమ్మడికాయ ఆకర్షిస్తుందట. అదేవిధంగా ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయను కట్టుకునే ముందు పూజారుల సలహా మేరకు పూజలు చేసిన తర్వాత కట్టుకోవడం వల్ల మరి మీకు ఫలితాలు కలుగుతాయట. చాలా మంది బూడిద గుమ్మడికాయ కట్టేటప్పుడు చేసే అతిపెద్ద తప్పు బూడిద గుమ్మడికాయను శుభ్రం చేయడం. ఇలా బూడిద గుమ్మడికాయను నీటితో శుభ్రం చేస్తే దానిపైన ఉన్న తెల్లటి పదార్థం వెళ్ళిపోతే కట్టినా కూడా ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నారు.