Drishti Dosham: మీ కారు,బైక్ కి దిష్టి దోషం పోవాలి అంటే.. శనివారం రోజు ఈ విధంగా చేయాల్సిందే!
మనం ఉపయోగించేటటువంటి కారు బైక్ కి నరదృష్టి, దృష్టి దోషం వంటివి తొలగిపోవాలంటే శనివారం రోజు కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:34 PM, Fri - 7 February 25

మామూలుగా మనం కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్లి పూజలు చేయించి దిష్టి తీస్తూ ఉంటాం. అయితే ఒకరు ఎదుగుతున్నప్పుడు ఒకరు కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు అది చూసి ఎదుటి వారికి కను దిష్టి తప్పకుండా తగులుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రయాణాలు సాఫీగా సాగవు.. కొన్ని కొన్ని సార్లు ఊహించని సంఘటనలు కూడా జరగవచ్చు. అయితే ఇలా దృష్టి దోష నివారణ ఉండకూడదు అనుకుంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏదైనా వాహనం కొనుగోలు చేసిన తర్వాత హ్యాండిల్ కు ఒక ఎరుపు రంగు నలుపు రంగు, కలిపి కట్టాలని ఆ తర్వాత ఇంటికి తీసుకురావాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కను దిష్టి తగలదట. ఇలా కట్టిన తర్వాత పూజ చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇంటికి తెచ్చిన తర్వాత కొత్త వాహనానికి దిష్టి తగలకూడదు అనుకుంటే.. 6 గవ్వలు, 5 జీడి గింజలు తీసుకొని వాటిని ఒక రాగి వైర్ కి ఒక గవ్వ, ఒక జీడిగింజ చొప్పున గుచ్చి మీ వెహికల్ కి కట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ వాహనానికి లైఫ్లాంగ్ దిష్టి దోషం అనేది ఉండదని పండితులు చెబుతున్నారు.
మన వాహనానికి దోషం ఉండకూడదు అనుకుంటే జిల్లేడు నారతో తయారు చేసినటువంటి జిల్లేడు తాడును కట్టాలని చెబుతున్నారు. ఈ జిల్లేడు తాడు మనకు పూజ స్టోర్ లలో లభిస్తుంది. కొత్తగా వాహనం కొన్నాక ఆ తాడును తీసుకొని మీ కుడి చేతి మణికట్టుకి కట్టుకోవాలి. అప్పుడు మీపై, మీ వాహనంపై కనుదిష్టి అనేది ఉండదని చెబుతున్నారు.
శనివారం రాత్రి పూట ఈ ప్రత్యేక పరిహారం చేస్తే వాహన దిష్టి దోషం తొలగిపోవడమే కాకుండా మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుందట. నెలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి బైక్ ను వాటర్ తో శుభ్రంగా కడగాలి. తర్వాత పసుపు గంధం కొద్దిగా రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మీ వాహనం ముందు వెనుక భాగంలో రెండు చొప్పున నిమ్మ దీపాలు వెలిగించాలి. అంటే నిమ్మదొప్పలను తీసుకొని దానిలో నువ్వుల నూనె పోసి కుంభవత్తి వేసి దీపం పెట్టాలి. అలా వెలిగించాక చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని ముందుకు కదిలించాలి. అదేవిధంగా వాహనానికి నెలకోసారి లేదా మూడు నెలలకోసారి దిష్టి తీసుకోవడం చేయాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే తప్పకుండా నరదృష్టి వాహనదృష్టి సమస్యల నుంచి మీ వాహనాలను సంరక్షించుకోవచ్చు అని చెబుతున్నారు.