Spirituality: ఈ పదాలు వాడినా, ఈ పనులు చేసిన లక్ష్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట!
ఇంట్లో కొన్ని రకాల పదాలను పదేపదే పలకడం కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట.
- By Anshu Published Date - 04:30 PM, Sun - 8 September 24

మామూలుగా చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని రకాల పూజలు చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగదు. అయితే లక్ష్మీ అనుగ్రహం కలగకపోవడానికి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశించకపోవడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాటు కూడా కారణం కావచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది లక్కీ లక్కీ అని పిలుస్తూ ఉంటారు. అదృష్టం అంటే లక్కీ అని అర్థం. అయితే ఈ పదం ఒక ఇంట్లో మూడుసార్లకు నుంచి వినపడితే లక్ష్మీదేవి వెళ్లిపోతుందట. ఎందుకంటే ఏ ఇంట్లో కష్టపడి పని చేయకుండా అదృష్టంపైనే ఆధారపడి ఉంటారో అదృష్టాన్నే నమ్ముకుని ఏ పని చేయకుండా సోమరితనం పెంచుకుని ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదట.
వెంటనే మీ ఇంటి నుండి వెళ్లిపోతుందట. అందుకే మీరు ఎప్పుడు అదృష్టంపైనే ఆధారపడకుండా కష్టాజితాన్ని నమ్ముకోవాలని అప్పుడు లక్ష్మీదేవి ఆమెనే వెతుక్కుంటూ వస్తుందని చెబుతున్నారు. దురదృష్టం దీనినే అన్ లక్కీ అని కూడా అంటూ ఉంటారు. ఈ పదాన్ని కూడా ఇంట్లో మూడుసార్లకు మించి ఉపయోగిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. ఎందుకంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా పొరపాటు చేసినప్పుడు వారు దాన్ని ఒప్పుకోకుండా మా టైమ్ బాగాలేదు. లేదా దురదృష్టం వల్లే ఇలా జరిగింది అని అంటుంటారు. ఈ దురదృష్టం పదాన్ని మూడుసార్లకు మించి వాడినా కూడా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటి నుండి వెళ్లిపోతుందట. కాబట్టి ఈ పదాన్ని వాడటం కూడా మానుకోవడం మంచిది. అలాగే ఇంట్లో పాలు పొరపాటున ఒలికిపోయినా కూడా లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి అలిగి వెళ్లిపోతుందట.
కలలో కూడా పాలు ఒలికిపోయినట్లు కనిపిస్తే లక్ష్మీదేవి వెళ్లిపోయిన మీకు కష్టాలు వస్తున్నాయడానికి సంకేతం. అలాగే ఆవు పాలు అయినా, గేదే పాలు అయినా లేదా ప్యాకెట్ పాలు అయినా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రతిరోజూ పాలు ఒలికిపోతుంటే వారికి కష్టాలు మొదలైనట్టే. ఇవి దరిద్రానికి సంకేతం. అలాగే ఎవరి ఇంట్లో పాలు పుష్కలంగా, జాగ్రత్తగా ఉంటే వారి ఇంట్లో ధనం పుష్కలంగా ఉంటుందట. చాలా మంది ఇళ్లలో పాలు ఒలికిపోయినపుడు దానిపైన మ్యాట్ వేసి లేదా ఏదైన బట్టను దాని మీద వేసి కాలితో తుడిచేస్తారు. అలాగే దానిపైనే నడుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు దరిద్రం పడుతుందట. కాబట్టి ఒకవేళ ఇలా పాలు ఒలికిపోతే దానిపైనే కొన్ని నీళ్లు చల్లి దానిపైన ఒక బట్టతో తుడవాలి. తర్వాత మరికొన్ని నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పూర్వం మన పెద్దవారు ఇలాగే చేసేవారట. ఎందుకంటే పాలు కింద నేలను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. పురాణాల ప్రకారం పాలను ఎవరైతే పవిత్రంగా భావిస్తారో.. పాలను ఎవరైతే ఆరాధిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
అలాగే పాలకు లక్ష్మీదేవికి, చంద్రుడికి లక్ష్మీదేవికి సంకేతం. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఐశ్వర్యాలను ఇస్తాడు. అందుకే ఎవరికైతే పాలలో చంద్రుడు కనిపిస్తాడో లేదా పాలలో ఎవరికైతే లక్ష్మీదేవి కనిపిస్తుందో వారికి అష్టఐశ్వర్యాలు లభిస్తాయి. అందుకే గృహ ప్రవేశం చేసినప్పుడు పాలను పొంగిస్తారు. ఒకవేళ మన ఇంట్లో ఉప్పు అయిపోతే శనివారం సోమవారం అమావాస్య రోజుల్లో ఉప్పును అస్సలు కొనకూడదట. అలా కొంటే మీకు దరిద్రం పడుతుందట. అలాగే ఉప్పును కింద పడకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరైతే లక్ష్మీదేవి నిత్యం ఇంట్లో ఉండాలని కోరుకుంటారో అలాంటి వారు ఆ మూడు రోజుల్లో ఉప్పును కొనుగోలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎవరైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో ధర్మానికి కట్టుబడి ఉంటారో సత్యం ఎక్కువ మాట్లాడుతుంటారో నీతి, నిజాయితీగా ఎవరైతే బతుకుతుంటారో అలాంటి వారిని విడిచి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లదట. అలాగే పక్షపాతం లేని చోట కూడా ధనలక్ష్మీ స్థిరంగా ఉంటుందని అలాంటి వారికి లక్ష్మీదేవి కరుణా, కటాక్షలు లభిస్తాయని చెబుతున్నారు.