HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Rakhi Krishnashtami Naga Panchami Festivals Coming In The Month Of August 2024

August Festivals – 2024 : రాఖీ, కృష్ణాష్టమి, నాగపంచమి..ఆగస్టులో వచ్చే పండుగలివే

ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఇది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. 

  • By Pasha Published Date - 09:10 AM, Wed - 24 July 24
  • daily-hunt
Festivals In August 2024

August Festivals – 2024 : ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఇది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం.  అందుకే ఈ నెలలో పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు ఎక్కువగా ఉంటాయి.  పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు. అందుకే ఈ మాసానికి శ్రావణం అనే పేరొచ్చింది. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడి జన్మ నక్షత్రం కూడా  శ్రవణమే.  చాంద్రమానం ప్రకారం 12 నెలల్లోని ఐదో నెల శ్రావణ మాసమే. ఆగస్టులో ఏ పండుగలు(August Festivals – 2024) ఎప్పుడు వస్తాయనేది మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • శ్రావణ మాసం మొదటి రోజు(ఆగస్టు 5) నుంచి పూర్ణిమ వచ్చే వరకు వచ్చే 15 రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి దేవతలకు  పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరణాలను దేవతలకు అర్పించడమే పవిత్రారోపణం.
  • ఆగస్టు 6న శ్రావణ శుద్ధ విదియ అంటారు. దీన్నే ‘మనోరథ ద్వితీయ’ అని పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి వాసుదేవుడిని పూజించి, సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి.
  • ఆగస్టు 7న ఉత్తర భారతదేశంలోని కొన్నిప్రాంతాల్లో  మధు శ్రావణీ వ్రతం పాటిస్తారు.

Also Read :Credit Cards : ఈ క్రెడిట్ కార్డులతో ఆదాయపు పన్ను చెల్లిస్తే రివార్డ్స్

  • ఆగస్టు 8న నాగులకు పూజ చేస్తారు. విఘ్నేశ్వరుడి పూజకు ఈ తిథి చాలా మంచిది.
  • ఆగస్టు 9న గరుడ పంచమి/నాగ పంచమి నిర్వహిస్తారు. ఈ రోజు విశిష్టత గురించి పార్వతీదేవికి శివుడు చెప్పాడని ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ప్రస్తావన ఉంది.
  • ఆగస్టు 11న సూర్యుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. ఆ రోజున  ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరిస్తారు.
  • ఆగస్టు 12 దుర్గాదేవి పూజకు అనుకూలం.  ఏడాది మొత్తం ప్రతినెలా అష్టమిరోజున దుర్గమ్మను పూజించడం శుభప్రదం.
  • ఆగస్టు 13న మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు.
  • ఆగస్టు 14న ఆశా దశమి నిర్వహిస్తారు.  ఈ రోజు చేసే పూజలతో కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
  • ఆగస్టు 15న పుత్ర  ఏకాదశి ఉంది. మహిజిత్తు అనే రాజుకు ఈ రోజు చేసిన వ్రత ఫలితంగా పుత్రుడు జన్మించాడట. అందుకే దీనికి పుత్ర ఏకాదశి అనే పేరొచ్చింది.
  • ఆగస్టు 16న(శుక్రవారం) వివాహితులు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు.
  • ఆగస్టు 17న (శనివారం) శని ప్రభావంతో బాధపడే వారు ప్రత్యేక రోజుల చేయడం మంచిది.
  • ఆగస్టు 18న పరమేశ్వరుడికి పవిత్రారోపణం చేస్తారు.
  •  ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి ఉన్నాయి.
  •  ఆగస్టు 20న ధనప్రాప్తి వ్రతం మొదలుపెట్టి భాద్రపద పౌర్ణమి వరకు కొనసాగిస్తారు.
  •  ఆగస్టు 21.. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథి ఇదే.
  • ఆగస్టు 23న గోపూజ చేయడం శుభప్రదం.
  • ఆగస్టు 24న రక్షా పంచమి వ్రతం నిర్వహిస్తారు.
  • ఆగస్టు 25న బలరామ జయంతిని నిర్వహిస్తారు.
  • ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీ కృష్ణుడికి పూజలు చేస్తారు. సాయంత్రం వేళ ఉట్లు కట్టి కొట్టే ఉత్సవం జరుగుతుంది.
  • ఆగస్టు 27న చండికా పూజ, కౌమారి పూజ, గోకులాష్టమి నిర్వహిస్తారు.
  • సెప్టెంబరు 2న పొలాల అమావాస్య నిర్వహిస్తారు.
  • సెప్టెంబరు 3న సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో.. దాన్ని శ్రావణమాస అమావాస్యగా పిలుస్తారు.
  • సెప్టెంబరు 4న భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది.

Also Read :Gold Price : కిలోకు రూ.6.20 లక్షలు తగ్గిన బంగారం.. ఎందుకు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • August Festivals - 2024
  • Krishnashtami
  • naga panchami
  • Rakhi

Related News

    Latest News

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd