Vastu tips : స్టడీ టేబుల్ వద్ద ఈ ఫొటో పెట్టండి…మీ పిల్లల అదృష్టం మారిపోతుంది..!!
- By hashtagu Published Date - 10:00 AM, Wed - 30 November 22
పిల్లల భవిష్యత్తు సరిగ్గా ఉండాలంటే ఇంట్లో వాస్తు సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు చదువుకునే స్టడీ రూం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొంతమంది పిల్లలు ఎంత చురుగ్గా ఉన్నా చదువులో రాణించలేకపోతారు. దీంతో తల్లిదండ్రలతోపాటు పిల్లలు కూడా మానసికంగా క్రుంగిపోతారు. అయితే చదువుతోపాటు కొంత వాస్తును కూడా నమ్మాలి. ఎందుకంటే మన ఇల్లు అనేది వాస్తు ప్రకారం ఉండాలి. అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాస్తులో లోపాలు ఉన్నట్లయితే నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి పిల్లల స్టడీ రూంతోపాటు వారి స్టడీ టేబుల్ ఈ చిత్రాన్ని ఉంచినట్లయితే వారి భవిష్యత్తు బాగుంటుంది.
సూర్యుని చిత్రపటం.
పిల్లలు స్డడీ రూంలో చదువుపైన్నే మనస్సు పెట్టి…చదువుకు దూరం అవ్వకుండా..మరింత ఆసక్తిని పెంచుకునేందుకు మొదలుపెడతారు. కాబట్టి మంచి ఫలితాలు రావాలంటే వారి చుట్టు ఉన్న ప్రదేశం కూడా బాగుండాలి. మీరు కొన్ని వాస్తు చిట్కాలు పాటించిటన్లయితే మీ పిల్లల భవిష్యతు బాగుంటుంది. వాస్తు ప్రకారం స్టడీ రూంలో సూర్యోదయ చిత్రాన్ని ఉంచాలి. ఇది వాస్తు పరంగా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. జీవితంలో మిమ్మల్ని ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తుంది.
గుర్రాలు పరుగెత్తే చిత్రం
పిల్లలు చదువుకునే గదిలో ఏడు గుర్రాలు పరుగెత్తు చిత్రం లేదా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల చిత్రాన్ని ఉంచాలి. ఇవి పిల్లల చదువుపై ఆసక్తి పెంచేలా చేస్తాయి.
జీవితంలో ఉన్నస్థానంలో ఉన్న వ్యక్తుల చిత్రాలు
కష్టపడి జీవితంలో పైకి వచ్చినవారి చిత్ర పటాలు స్టడీరూంలో ఉంచాలి. ఇవి పిల్లలను ప్రేరేపించేలా చేస్తాయి.
కొంగ బొమ్మ
స్టడీ టేబుల్ మీద మెడిటేషన్ లో ఉన్న కొంగ చిత్ర పటాన్ని ఉంచాలి. పిల్లల మనస్సు చదువుపై మళ్లుతుంది.
సరస్వతి విగ్రహం
ప్రతిరోజూ చదువుకునే ముందు విద్యాదేవత సరస్వతికి నమస్కరించి చదువు ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల మనస్సు అధ్యయనంపై ఉంటుంది.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.