Spiritual: పూజా ఫలితం దక్కాలంటే ఇలా పూజ చేయాల్సిందే!
పూజ ఫలితం దక్కాలంటే పూజ చేసేటప్పుడు తెలిసి తెలియకుండా కొన్ని రకాల పొరపాట్లు అసలు చేయకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:35 PM, Wed - 18 September 24

మామూలుగా కొందరు ప్రతిరోజు దీపారాధన చేస్తే మరికొందరు వారానికి కేవలం రెండు మూడు సార్లు మాత్రమే ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంకొందరు కార్తీకమాసం ఆషాడమాసం శ్రావణమాసం వంటి మాసాలలో నెలరోజుల పాటు కంటిన్యూగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఎంత బాగా పూజలు చేసిన కూడా ఆ పూజ ఫలితం దక్కదు. అందుకు గల కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి పరిహారాలు పాటించాలో, ఎలా చేస్తే పూజ ఫలితం దక్కుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంటి ఆలయానికి సంబంధించి వాస్తు శాస్త్రంలో.. కొన్ని నియమాలు ఉన్నాయి.
వీటిని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా పూజలు చేయాల్సి ఉంటుంది. పూజ సమయంలో మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలోనే ఉంచి పూజ చేయాలి. తూర్పు దిక్కుకు అభిముఖంగా పూజించడం వల్ల పూజా ఫలం దక్కుతుందట. దేవతలు, దేవుళ్లు తూర్పు దిశలో నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఈ దిశను సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి తూర్పు దిశగా ముఖం కనబడే విధంగా కూర్చుని పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయట. నేలపై కూర్చొని మాత్రమే పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. పూజ సమయంలో నేలపై ఆసనం వేసి నిటారుగా కూర్చోవాలి. కానీ ఆరాధన సమయంలో ఎప్పుడూ కూడా ఖాళీ నేలపై కూర్చోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరాధన పూర్తి ఫలితాన్ని ఇవ్వదు.
అంతేకాకుండా మీ పూజా సామగ్రిని పూజా గదిలోనే పెట్టాలి. మీరు మీ ఇంట్లో ఆలయం నిర్మించాలనుకుంటే.. ఆలయం ఎత్తు దాని వెడల్పునకు రెట్టింపు ఉండేలా చూసుకోవాలనీ అలా మాత్రమే నిర్మించుకోవాలని చెబుతున్నారు. అలాగే దాని చుట్టూ దుమ్ము, దూళి, మురికి ఉండకూడదట. మెట్ల కింద గుడి కట్టకూడదు. ఎందుకంటే అటువంటి ప్రార్థనా స్థలం మీ ఇంట్లో భారీ నిర్మాణ లోపాలను కలిగిస్తుందని చెబుతున్నారు.