Spatika: స్పటిక మీ ఇంట్లో ఉంటే చాలు మీ ఇల్లు ఆనందమయం అవడం ఖాయం!
అయితే ఇక మీదట దిగులు చెందాల్సిన పనిలేదని ఇంట్లో స్పటిక ఉంటే చాలు ఆ ఇల్లు ఆనందమయం అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు.
- By Anshu Published Date - 02:02 PM, Thu - 19 December 24

మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉండడం అన్నది సహజం. కష్టాలు లేని మనిషి ఉంటాడు అన్నది అసంభవం అని చెప్పవచ్చు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఆర్థిక సమస్యలతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. జీవితంలో సంతోషం లేదని దిగులు చెందుతూ ఉంటారు.
అయితే ఇక మీదట దిగులు చెందాల్సిన పనిలేదని ఇంట్లో స్పటిక ఉంటే చాలు ఆ ఇల్లు ఆనందమయం అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్పటికను నరదృష్టి తొలగించడానికి అలాగే ధనాకర్షణ పెరగడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో స్పటిక ఉండటం వల్ల వ్యాపారాలు అభివృద్ధి చెంది ఇంట్లో శుభం నెలకొంటుందట. స్పటికను ఆదివారం లేదా సోమవారం ఇంటికి తెచ్చుకోవాలి అని చెబుతున్నారు. ఈ స్పటికను అమావాస్య రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదట.
ఇంటి గుమ్మం పైన ఎరుపు వస్త్రంలో స్పటికను కట్టి ఉంచడం ద్వారా ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా అది లాగేసుకుంటుందట. ఇలా కట్టిన ఇప్పటికైనా ప్రతి అమావాస్యకు లేదంటే మూడు నెలలకు ఒకసారి మార్చడం వల్ల సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయట. ఇక స్నానం చేయడానికి ముందు స్పటికను నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. వ్యాపార అభివృద్ధి కోసం క్యాష్ కౌంటర్ దగ్గర ఒక గాజు ప్లేటులో ఈ స్పటికను పెట్టి ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి వ్యాపారం కూడా బాగా జరుగుతుందని చెబుతున్నారు. ఇలా స్పటికతో ఈ విధమైన రెమెడీలు ఫాలో అవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆ ఇంట ఆనందం సంతోషం నెలకొంటుందని చెబుతున్నారు.