HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >People With These Zodiac Signs Should Do Shani Puja

Shani Puja: ఈ రాశుల వారు ఇవాళ తప్పనిసరిగా శనిదేవుడిని పూజించాలి…అన్ని శుభాలే..!!

ఇవాళ శనిత్రయోదశి. జ్యోతిషశాస్త్రంలో శనిత్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు శనిదేవుడికి పూజచేస్తే...దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.

  • Author : Hashtag U Date : 14-05-2022 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
shani
shani

ఇవాళ శనిత్రయోదశి. జ్యోతిషశాస్త్రంలో శనిత్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు శనిదేవుడికి పూజచేస్తే…దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. మరి ఇవాళ ఏయో రాశులవారు తప్పనిసరిగా శనిపూజ నిర్వహించాలో తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం…శనివారం శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. శనిని న్యాయ దేవుడిగా భావిస్తుంటారు. వ్యక్తులను కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు శనిదేవుడు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే…ఆ వ్యక్తుల జీవితమే మారుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా కలిసి వస్తుంది. సుఖసంతోషాలతో ఉంటారు.

ఇవాళ శనివారం…అందులోనూ శనిత్రయోదశి. ఆ శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానిక ఇంతకన్నా మంచి రోజు ఇంకోటిఉండదు. శనిదోషం ఉన్నవారు ఇవాళ తప్పనిసరిగా శని దేవుడిని పూజించాలి. శనిదేవుడికి పూజలు చేసినవారి కష్టాలు తొలగిపోతాయి. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 29ఏప్రిల్ 2022న మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని రాశి మార్పుతో కొన్ని రాశుల మీద శని సడేసతి ప్రారంభమవుతుంది. అందుకే ఆయా రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుంభ,మకర, మీన రాశుల వారికి ఏలినాటి శన నడుస్తోంది. ఏలినాటి శనివల్ల బాధలు తప్పవు. కర్కాటక, వృశ్చిక రాశి వారిపై కూడా ఏలినాటి ప్రభావం ఉంది. అందువల్ల ఈ ఐదు రాశుల వారు ఇవాళ శనిదేవుడిని పూజించాలి. శని దోషం తగ్గుతుంది.

శనివారం సూర్యాస్తమయం తర్వాత…రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం నాడు హనుమాన్ ను ఆరాధిస్తే…శనిదేవుడు శాంతిస్తాడని పురాణాల్లో ఉంది. బజరంగబలి భక్తులను తాను ఎప్పుడూ వేధించనని శనిదేవుడు హనుమంతుడికి వాగ్దానం చేశాడని పురాణాల ప్రకారం చెబుతుంటారు. అందుకే శని దోషాలు తొలగేందుకు హనుమంతుడిని పూజించాలి.

ఆ శనిదేవుడి ఆశిస్సులు ప్రసన్నం కావాలంటే శనివారం నాడు రావి చెట్టుకు నీటిని సమర్పించి…చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. పేదవారికి దానం చేయాలి. ఇలా చేస్తే శని దోషం తొలగిపోయి…శుభాలే కలుగుతాయట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • shani puja
  • shani trayodashi
  • zodiac sign

Related News

Do not do these things today.

Shani Trayodashi 2026: ఈరోజు ఈ పనులు చేయకండి

ఏంటి, ఎందుకు పనులు చేయొద్దు? ఏంటి ప్రత్యేకత అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. శని త్రయోదశి (Shani Trayodashi 2026). శని త్రయోదశి అనేది శనిదేవుని పూజకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ సందర్భంగా శనిదేవుని ఆరాధించడం ద్వారా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు. శని గ్రహ దోషాల నుండి విముక్తి పొందడానికి, శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుని అన

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd