Peacock Feathers: పడకి గదిలో నెమలి ఈకలను ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా..?
నెమలిని,నెమలి ఈకలను ఇష్టపడని వారు ఉండరేమో. ఎందుకంటే ఈ నెమలిని కలవడానికి ఎంతో అందంగా
- By Nakshatra Published Date - 08:30 AM, Tue - 2 August 22

నెమలిని,నెమలి ఈకలను ఇష్టపడని వారు ఉండరేమో. ఎందుకంటే ఈ నెమలిని కలవడానికి ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నెమలిని చూసినప్పుడు చిన్న,పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల్లాగా మారిపోతూ ఉంటారు. అయితే ఈ నెమలి ఈకలను చాలా మంది ఇంటిలో అలంకరణగా కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రంగా కూడా నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవాలి అని పండితులు చెబుతున్నారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే వాస్తు శాస్త్ర ప్రకారం నెమలి ఈకలు మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను పారద్రోలి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. పురాణాల ప్రకారం నెమలి పించం మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల రాహు ప్రభావం మన ఇంటి మీద ఉండదు.నెమలి ఈకలను ఇంటిలో దక్షిణదిశలో పెట్టడం వల్ల మనకు సంపద చేకూరుతుంది.
పడకగదిలో నెమలి పించం ఉంటే వివాహ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు.
శ్రీకృష్ణుని కిరీటం పై ఉన్న నెమలి ఇకను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు దూరం అవుతాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోను దక్షిణ దిశలో నెమలి ఈకలను ఉంచినట్లయితే డబ్బు కొరత ఉండదు.
Related News

Vastu Tips : ఇంట్లో పరమ శివుడి చిత్ర పటం ఏ దిక్కులో పెట్టాలో తెలుసుకోండి..!!
శ్రావణ మాసం శివునికి అంకితమైన మాసం. భక్తులందరూ శ్రావణ మాసంలో పరమశివుని పూజిస్తారు. పూజలు, అభిషేకాలతోపాటు దేవుడి పూజల్లో భక్తులు బిజీగా ఉంటారు.