Chandra Grahanam: గ్రహణం పట్టణ గుడి.. ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు.. ఎక్కడో తెలుసా?
హిందూ సనాతన ధర్మం ప్రకారం గ్రహణ కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ
- Author : Anshu
Date : 08-11-2022 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూ సనాతన ధర్మం ప్రకారం గ్రహణ కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పనులు చేయకుండా తినకుండా కొంతమంది అయితే ఉపవాసాలు కూడా ఉంటారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆలయాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాల వరకు అన్నింటిని గ్రహణ సమయానికంటే ముందుగా ఆలయ తలుపులు మూసివేస్తారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో గుళ్లను మూసి వేస్తారు. గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ చేపట్టి ఆలయాన్ని శుద్ధి చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు.
కాగా ఎప్పటినుంచో ఈ ఆచారం వస్తున్న విషయం తెలిసిందే. అయితే గ్రహణ సమయంలో కొన్ని ఆలయాలు మూసి ఉంటే మరికొన్ని ఆలయాలు తెరిచి ఉంటాయట. అందులో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం కూడా ఒకటి. గ్రహణాలు పట్టని గుడి కూడా మరొకటి ఉంది. ఆ గుడి తూర్పుగోదావరి జిల్లా శ్రీ శక్తి పీఠంగా ఖ్యాతిగాంచింది. పిఠాపురం పట్టణంలో గ్రహణాలు పట్టని ఒక గుడి ఉంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎలాంటి గ్రహణాల సమయంలో అయినా కూడా ఎప్పటిలాగే గుడి తలుపులను తెరిచి ఉంచుతారు.
పాదగయ పుణ్యక్షేత్రం.. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి యధావిధిగా పూజలను అందుకుంటూ ఉంటారు. పూర్వ ఆచార ప్రకారం తెలుగు రాష్ట్రాలలో శ్రీకాళహస్తీ, పిఠాపురం,పాదగయ క్షేత్రం గ్రహణ సమయంలో తెలిసి ఉండే దేవాలయాలుగా చెబుతూ ఉంటారు. నేడు చంద్రగ్రహణం కాలం అన్న విషయం తెలిసిందే. ఈ గ్రహణ సమయంలో కూడా భక్తులకు దర్శనాలు అలాగే పూజలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయం అయిన రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి,అష్టాదశ శక్తిపీఠం పురుహూతిక అమ్మవారు, స్వయంభు దత్తాత్రేయ స్వామి వారిలను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక ఆలయంలో చంద్రగ్రహణం కాలం పట్టు విడుపు స్నానాలు చేసి అభిషేకాలు అర్చనలు లాంటి ప్రత్యేక పూజలు అమర్చకులు నిర్వహిస్తారు.