Owl: ఇంట్లో గుడ్లగూబ బొమ్మను లేదా ఫోటోను పెట్టుకోవచ్చా?
చాలామంది ఇంట్లో రకరకాల జంతువుల పక్షుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో గుడ్లగూబ బొమ్మలను లేదంటే ఫోటోలను పెట్టుకోవచ్చా లేదా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:02 PM, Sat - 17 May 25

గుడ్లగూబ.. ఈ పేరు వినగానే ముందుగా ఆ పక్షి ఆకారం దాని కళ్ళు గుర్తుకు వస్తూ ఉంటాయి. పెద్దటి కళ్ళతోటి కోపంగా చూస్తున్నట్టుగా దీని ఆకారం ఉంటుంది. ఈ పక్షి చాలా చిన్నదే అయినప్పటికీ కళ్ళు మాత్రం చాలా షార్ప్ గా ఉంటాయని చెప్పాలి. గుడ్లగూబను హిందూమతంలో లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. లక్ష్మీ అనుగ్రహం కోసం కూడా కొంతమంది గుడ్లగూబ కు సంబంధించిన ఫోటోలు డ్రాయింగ్లు పెయింటింగ్లు విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు..
అయితే ఇంతకీ గుడ్లగూబ కు సంబంధించిన ఫోటోలు బొమ్మలు ఇంట్లో పెట్టుకోవచ్చా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం.. ఇది ఐశ్వర్యానికి, మంచికి చిహ్నంగా భావించాలి. గుడ్లగూబ బొమ్మ దుష్టశక్తులను తరిమి కొడుతుందట. చెడు దృష్టిని కూడా తొలగిస్తుందట. ఇంట్లో శుభం జరగడంతో పాటు ఆనందం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా మీ వ్యాపార స్థలాలలో గుడ్లగూబ బొమ్మ పెట్టడం వల్ల వ్యాపారం బాగా జరిగి లాభాలు కలిసి వస్తాయని చెబుతున్నారు.
ఎక్కడైనా సరే గుడ్లగూబను ఉత్తరం లేదంటే ఈశాన్య దిశలో పెట్టడం మంచిదని చెబుతున్నారు. అయితే ఎల్లప్పుడూ మంచి బొమ్మను మాత్రమే పెట్టాలని భయంకరంగా ఉండే బొమ్మను అస్సలు పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా పెట్టిన బొమ్మను మామూలు రోజులతో పాటు దీపావళి రోజు ప్రత్యేకంగా పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. అదేవిధంగా గుడ్లగూబను ఐశ్వర్యానికి జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ గుడ్లగూబ బొమ్మ ఫోటోలు ఇంట్లో ఉండటం చాలా మంచిదట. వీటితోపాటుగా బయట ఎక్కడైనా సరే గుడ్లగూబలకు ఆహారం పెట్టడం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. వీటికి హాని తలపెట్టే పని చేస్తే అమ్మవారికి కోపం వస్తుందట. చాలామంది గుడ్లగూబను చూసి భయంతో అవి ఏమీ చేయకముందే రాళ్లతో కొట్టడం కర్రలతో కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు.