Basil Plant: తులసి ఆకులతో మాత్రమే కాదండోయ్ వేర్లతో కూడా అద్భుతం.. డబ్బే డబ్బు?
భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావిస్తూ పూజిస్తారు. తులసి మొక్క కేవలం ఆరోగ్యానికి
- By Nakshatra Published Date - 06:00 AM, Tue - 6 December 22
భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావిస్తూ పూజిస్తారు. తులసి మొక్క కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అదృష్టం తెచ్చి పెట్టడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. హిందువులు తులసి మొక్కను గౌరవించడంతోపాటు మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. తులసి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తులసిని పూజించి నీరు సమర్పించాలి. అలాగే విష్ణు పూజలో తులసి దళాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు లభిస్తుంది.
ఈ విధంగా తులసి మొక్క పరిహారాలు పాటించడం వల్ల తల్లి లక్ష్మీ-నారాయణల అనుగ్రహం తప్పక లభిస్తుంది. తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల తప్పక తులసీఅలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించి అనుకున్న పనులు విజయం సాధించడంతోపాటు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్పవచ్చు. అయితే కేవలం తులసి మొక్కనే కాదండోయ్ తులసి వేర్లు కూడా ప్రభావంతంగా పనిచేయడంతో పాటు అదృష్టాన్ని మరింత పెంచుతాయి. మీరు ఏదైనా పని అనుకున్నప్పుడు అందులో తరచూ ఆటంకాలు ఎదురైనప్పుడు 2 నుండి 3 ప్రాంతాల పొడవు గల తులసి వేరును గంగాజలంతో కడగాలి.
ఆపై పూజ చేసిన తర్వాత పసుపు బట్టలో కట్టి మీ దగ్గర ఉంచుకొని బయటకు వెళ్లేటప్పుడు మీతో పాటుగా తీసుకుని వెళ్లడం వల్ల వెళ్లే పనిలో విజయం లభిస్తుంది. మీకు డబ్బు కొరత ఉండకూడదు అనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు నీళ్లు పోయండి. అలాగే సాయంత్రం దీపం వెలిగించాలి. దీనితో పాటు శుక్రవారం నాడు మెడలో తులసి మూలాలను వెండి హారతిలో ధరించండి.
Related News
Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తులసి ఆకుతో ఈ చిన్న పరిహారం పాటించాల్సిందే?
హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తిశ్రద్ధలతో తులసి మొక్కకు పూజలు చే