Navaratri 2024: నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగించారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
నవరాత్రుల సందర్భంగా అఖండ దీపాన్ని వెలిగించిన వారు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 4 October 24

దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే నవరాత్రులలో ఒక రోజు పూర్తి అయింది. నేడు రెండవ రోజు. నిన్నటి రోజు నుంచి పవిత్రమైన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి దుర్గా దేవికి అంకితం చేయబడింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మిగతా దేవత దేవుళ్ళతో పోల్చుకుంటే దుర్గాదేవిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి 9 రకాల రూపాలను పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవి ప్రత్యేక ఆశీస్సులు పొందేందుకు ఒక సువర్ణావకాశంగా భావిస్తారు.
ఈ నవరాత్రి సందర్భంగా చాలామంది ప్రతి రోజు పూజలు చేస్తూ ఉంటారు. మొదటి రోజున అఖండ దీపాన్ని వెలిగించి ఉంటారు. అయితే అఖండ దీపం వెలిగించడం మంచిదే కానీ కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మీరు కూడా నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగించినట్లు అయితే అఖండ జ్యోతిని వెలిగించడానికి తొమ్మిది రోజులు పాటు ఆ అఖండ జ్యోతి ఆరిపోకుండా చూసుకోవాలి. నవరాత్రులలో శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద| శత్రు బుద్ధి వినాశాయ దీపకాయ నమోస్తుతే|| దీపో జ్యోతి పరం బ్రహ్మ దీపో జ్యోతిర్జనార్ధనః | దీపో హరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతే || అనే ఈ మంత్రాన్ని జపించాలి. అఖండ జ్యోతిని వెలిగించడానికి ఒత్తిగా కాటన్ బట్టని ఉపయోగించాలి.
ఇలా వెలిగించిన దీపం తొమ్మిది రోజులు ఆరిపోకుండా చూసుకోవాలి. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నిరంతర వెలిగే అఖండ జ్యోతిని ఎప్పుడూ నేలపై నేరుగా ఉంచకూడదు. ఈ అఖండ జ్యోతిని పెట్టే నేల మీద ధాన్యం లేదా బియ్యం పోసి అప్పుడు అఖండ జ్యోతిని పెట్టుకోవాలని చెబుతున్నారు. అఖండ జ్యోతిని వెలిగించడానికి నెయ్యి లేదా నూనెను ఉపయోగించాలి. అఖండ జ్యోతిని నెయ్యితో వెలిగిస్తున్నట్లయితే దానిని ఎల్లప్పుడూ పూజా గదికి కుడి వైపున ఉంచాలట. అఖండ జ్యోతిని నూనెతో వెలిగిస్తే అప్పుడు ఆ దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమ వైపున ఉంచాలని గుర్తుంచుకోవాలట. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత ఇంటికి తాళం వేయవద్దు. ఇంట్లో ఈ తొమ్మిది రోజులలో ఎవరో ఒకరు ఉండాలి. అఖండ జ్యోతిని వెలిగించే సమయంలో గతంలో ఉపయోగించిన దీపాన్ని పొరపాటున కూడా మళ్ళీ ఉపయోగించవద్దు. అదే విధంగా అఖండ జ్యోతిని వెలిగిస్తే తొమ్మిది రోజులు వెలిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదే సమయంలో నవరాత్రులు ముగిసిన తర్వాత అఖండ ద్వీపాన్ని అర్పవద్దు. ఆ ద్వీపం దానికి అదే ఆరిపోనివ్వాలి. చాలామంది తొమ్మిది రోజులు అయిపోయింది కదా అని నోటితో చేతులతో ఆర్పేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకండి. నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ దీపం దానంతట అదే కొండెక్కి వరకు వేచి చూడడం మంచిదని చెబుతున్నారు.