Mystic Cross: మీ అరచేతిలో “మిస్టికల్ క్రాస్” ఉందా.. అయితే మీరే లక్కీ!!
చేతి గీతల్లోనే జీవితపు భవిష్యత్ రాత దాగి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. అందుకే చేతి గీతల్లో దాగిన రహస్యాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.
- By Hashtag U Published Date - 06:00 AM, Wed - 24 August 22

చేతి గీతల్లోనే జీవితపు భవిష్యత్ రాత దాగి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటారు.
అందుకే చేతి గీతల్లో దాగిన రహస్యాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ రోజు మనం ఒక గుర్తు ను గురించి తెలుసుకోబోతున్నాం. ఒకవేళ అది మీ చేతిలోనూ ఉంటే ఇక మీకు ఎదురు ఉండదు. అదేమిటంటే.. మన అర చేతి మధ్యలో రెండు పెద్ద లైన్స్ ఉంటాయి. వాటిలో పైన ఉన్నది హార్ట్ లైన్.. కింద ఉన్నది హెడ్ లైన్ . ఈ రెండింటి మధ్య కొందరికి క్రాస్ గుర్తు తరహా గీతలు ఉంటాయి. దీన్ని జ్యోతిష్య నిపుణుల భాషలో “మిస్టికల్ క్రాస్” అంటారు. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అనే తేడా లేకుండా ఏ ఒక్క దానిపై ఇది ఉన్నా.. మీరు చాలా లక్కీ అన్నట్టు.
“మిస్టికల్ క్రాస్” ఉంటే ఏమవుతుంది?
ఈ గుర్తు చేతిలో ఉన్నవారిని అకస్మాత్తుగా సిరి సంపదలు వస్తాయి. వీళ్ళు డబ్బును చాలా బాగా మేనేజ్ చేస్తారు. పొదుపుగా ఖర్చు చేస్తారు. అలా అని వీళ్ళు పిసినారులు కాదు. పేదలు, కష్టంలో ఉన్నవాళ్లకు బాగా సాయం చేస్తారు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు. తమకు ఉన్నదాంట్లో కొంత సాయం చేసేందుకు సిద్ధం అవుతారు. ఇతరులు చేసే పనులకు ఎప్పుడూ ఆటంకం కలిగించరు.వీరికి ఉన్న ఈ సుగుణాల వల్ల ప్రజల్లో మంచి పేరు వస్తుంది.
ఆధ్యాత్మిక భావాలు..
ఈ రేఖ ఉన్నవాళ్లు ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. భగవంతుని స్మరణకు సమయం కేటాయిస్తారు. ఈ గుర్తు ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులే కాదు.. బుద్ధిమంతులు కూడా. నిర్ణయాలు తీసుకునే విషయంలో వీరు ఇతరుల కంటే బెటర్ గా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ ఆర్ధిక సమస్యలు రాకుండా ప్లానింగ్ చేసుకోవడంలో వీరు దిట్ట. వీరు ఇతరులను ఇట్టే తమ వైపు లాక్కోగలరు. వీరి మంచితనాన్ని చూసి అందరూ తమంత తాముగా వచ్చి.. వీరితో స్నేహం ఏర్పర్చుకుంటారు. ఈ గుర్తు ఉన్న క్రియేటివ్ గా ఉంటారు. క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ఇదే వీరిని అందరిలో ఒకడిగా నిలబెడుతుంది.