Mauni Amavasya: ఈ ఏడాది మౌని అమావాస్య ఎప్పుడు.. మహా కుంభమేళాలో దీని ప్రాధాన్యత ఏమిటో మీకు తెలుసా?
ఈ ఏడాది మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాకు ఈ మౌని అమావాస్యకు ఏమైనా సంబంధం ఉందా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:45 PM, Fri - 24 January 25

ఈ సారి పుష్య అమావాస్య జనవరి 29 వ తేదీ బుధవారం రోజున వస్తుంది. ఈ రోజున మౌని అమావాస్య వచ్చింది. అలాగే మరోవైపు ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో పవిత్రమైన మహా కుంభమేళ ఉత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళా ఉత్సవానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ కుంభమేళా సమయంలోనే మౌని అమావాస్య వచ్చిన సందర్భంగా కొన్ని రకాల నియమాలను పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ నియమాలు ఏంటో,పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముఖ్యంగా పుష్య అమావాస్య రోజున చనిపోయిన పూర్వీకుల కోసం శ్రాధ్ద కర్మాదికాలు చేస్తే వారికి పుణ్యలోకాలు కల్గుతాయట. వారి ఆశీర్వాదాలు కల్గుతాయని పెద్దలు చెబుతున్నారు. అంతే కాకుండా గంగా స్నానం చేస్తే అనేక పాప కర్మల నుంచి విముక్తి లభిస్తుందట. ఈ రోజున ప్రయాగ్ రాజ్ కుంభమేళలో చాలా మంది షాహీ స్నానం ను ఆచరిస్తారు. ఈ రోజు పూజలు, ఉపవాసం, దానా ధర్మాలు, ఏవి చేసిన కూడా అది కొన్ని వందల రెట్లు అధిక లాభాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు. అందుకే మౌనీ అమావాస్య రోజున ఏలీనాటి శనిదోషాలతో బాధపడుతున్నవారు నల్ల చీమలకు బెల్లం లేదా చక్కెర తినేందుకు పెట్టాలని చెబుతున్నారు.
అంతే కాకుండా రావి చెట్టు నీడలో నేతి దీపం పెట్టాలని చెబుతున్నారు. అలాగే పేదలకు అన్నదానం చేయాలని చెబుతున్నారు. ఈ మౌని అమావాస్య రోజున పవిత్రమైన నదుల్లో స్నానం చేసి మన మనసులో ఉన్న బలమైన కోరికను కోరుకొని ఇష్టమైన పదార్థంను ఏడాది పాటు వదిలేస్తే ఆ కోరిక వెంటనే తీరుతుందని పండితులు చెబుతున్నారు. అందుకు పవిత్రమైన మౌని అమావాస్య రోజున పరిహారాలు పాటించాలని పెద్దలు చెబుతున్నారు. ఈ మౌని అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు రెట్టింపు ఫలితాలను అందిస్తాయట.