Rangam Bhavishyavani : ఈ ఏడాది ఎలా ఉండబోతుందో చెప్పిన ‘స్వర్ణలత భవిష్యవాణి’
పాడి, పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు
- By Sudheer Published Date - 04:08 PM, Mon - 22 July 24

సికింద్రాబాద్ లష్కర్ బోనాల (Lashkar Bonalu) జాతరలో రెండో రోజైన ఈరోజు (జులై 22) ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి (Mathangi Swarnalatha Rangam Bhavishyavani) వినిపించడం ఆనవాయితీ. భవిష్యవాణి ఏంచెపుతుందా అని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే ఎదురుచూసారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్నారు. పాడి, పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. తనకు మట్టి బోనాలు, స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటానని తెలిపారు. వర్షంలో తడిచి మరీ భక్తులు బోనాలు సమర్పించి.. దర్శించుకున్నారంటూ అమ్మవారికి పూజారులు తెలుపగా.. ఆ మాత్రం కష్టపడాలని… లేకపోతే సోమరిపోతులు అవుతారని అమ్మవారు పలికారు. ఈ ఏడాది ఐదువారాల పాటు పప్పు బెళ్లాలతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు ఆజ్జాపించారు. గర్భిణీ స్త్రీలకైనా, బాలలకైనా, ఎటువంటి వారికైనా ఆటంకం రాకుండా చూసుకుంటానని చెప్పారు. ప్రజలందరితో తన రూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటానని, తన రూపాన్ని నిలబెట్టుకుంటానని భవిష్యవాణిలో తెలిపారు. పాడిపంటలు సమృద్ధి చేస్తే రోగాలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
Read Also : Kalki : కల్కి టీం ఫై పీఠాధీశ్వరుడు ఆగ్రహం