Spiritual: మార్కండేయ జయంతి ఎప్పుడో తెలుసా…చిరంజీవుడిగా ఎందుకు మారాడు..?
హిందూ పంచాంగం ప్రకారం...ప్రతిఏడాది మాఘమాసంలో మార్కండేయ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. 2022వ సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తేదీ గురువారం రోజున మార్కెండేయ జయంతి వస్తోంది. హిందూ పురాణాల ప్రకారం బ్రుగ మహిర్షి కుమారుడే మార్కెండేయుడు.
- By Hashtag U Published Date - 10:16 AM, Sat - 29 January 22

హిందూ పంచాంగం ప్రకారం…ప్రతిఏడాది మాఘమాసంలో మార్కండేయ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. 2022వ సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తేదీ గురువారం రోజున మార్కెండేయ జయంతి వస్తోంది. హిందూ పురాణాల ప్రకారం బ్రుగ మహిర్షి కుమారుడే మార్కెండేయుడు. అల్పాయుష్కుడైన తనను 16 సంవత్సరాల వయస్సులోనే ఆ పరమేశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే మార్కెండేయ మహర్షి జయంతి రోజున భక్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మార్కెండేయ జయంతి చరిత్రతోపాటుగా మార్కెండేయుని ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కెండేయుని పురాణం. శివ భక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మార్కండేయుడిని పేరు వినిపిస్తుంది. చిన్నారుల్లో దేవుని పట్ల విశ్వాసాన్నీ కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన శ్రద్ధ గురించి మార్కండేయుని కథను ఆదర్శంగా తీసుకుని చెబుతుంటారు.
పూర్వకాలంలో మృకండుడు అనే ముని ఉండేవాడు. ఆయనకు మరుద్వతి అనే భార్య ఉండేది. ఆ ముని పరమేశ్వరుడిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటుండగా మ్రుగాలు తనను తన్నుకుంటూ పోతాయి. అయినా పట్టించుకునేవాడు కాదు. ఆ భోలనాథుడిని స్మరించుకుంటూ హాయిగా జీవిస్తున్న ఆ దంపతులిద్దరికీ ఎంత ప్రయత్నించినా పిల్లలు కలగలేదు. పిల్లలు కలగాలని కోరుకుంటూ వారు వారణాసికి చేరుకుని అక్కడ పరమేశ్వరుడిని పూజిస్తారు.
వారి దీక్షకు చలించిపోయిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై మీకు పిల్లలు తప్పకుండా పుడతారు…కానీ ఎలాంటి పిల్లలు కావాలో మీరే నిర్ణయించకోండి అని చెబుతాడు. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాల లేదంటే 16 ఏళ్లు మాత్రమే జీవించే ఉత్తమ పురుషుడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ కూడా వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఎన్నిరోజులు ఉంటే మాత్రం ఏం లాభం…మాకు ఉత్తమ తెలివితేటలు ఉన్న వ్యక్తి అల్పాయుషు ఉన్నా సరే అని కోరుకున్నారు.
వారి కోరికను శివుడు నెరవేరుస్తాడు…ఆ దంపతులిద్దరికీ ఒక బాలుడు కలుగుతాడు. మృకందుని కొడుకు కాబట్టి మార్కండేయా అని పేరు పెట్టుకుంటారు. శివుని మాటలకు తగ్గట్లుగానే మార్కెండేయుడు అందంగా తెలివితేటలు కలవాడుగా సకల సుగుణాలు ఉన్న వ్యక్తిగా పెరిగి పెద్దవాడవుతాడు. వ్యక్తిత్వంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకుంటాడు. ఇలా ఉండగా…ఓ రోజు మృకందుని ఆశ్రమానికి సప్తరుషులు వస్తారు. మార్కండేయుడిని చూసి తనకు త్వరలో ఆయుష్షు తీరుతుందని వారికి తెలిసిపోతుంది. అప్పుడు తనను బ్రహ్మదేవుని దగ్గరకు తీసుకెళ్తారు. తనను అను నిత్యం పరమేశ్వరున్ని పూజించమని చెబుతారు. అందరూ కలిసి శివనామస్మరణ చేస్తే ఎలాంటి మరణం ఉండదని మార్కెండేయునికి తెలియజేస్తారు.
అప్పటినుంచి మార్కండేయ ప్రతిరోజూ శివలింగం ఎదుట కూర్చుని శివనామస్మరణ చేస్తుంటాడు. మ్రుత్యుఘడియలు సమీపిస్తున్నవేళ యమునిఆదేశాలతో యమభటులు మార్కెండేయుని తీసుకుకొచ్చేందుకు వస్తుంటారు. అయితే తను నిత్యం శివుడి జపంలో ఉండటం చేత తన దరిదాపుల్లోకి వెళ్లలేకపోతారు. దీంతో యముడే స్వయంగా మార్కండేయుని దగ్గరంకు బయలుదేరుతాడు. తన వద్దకు వెళ్లి శివధ్యానం ఆపి ఇటురా అంటాడు. ఆ మాటలు విన్న మార్కండేయ శివలింగాన్ని పట్టుకుని మ్రుత్యుంజయ మంత్రాన్ని పఠిస్తాడు.
యమునికి ఏం చేయాలో తెలియక…తన అస్త్రమైన యమపాశాన్ని మార్కండేయుని మీదకు వదులుతాడు. కానీ మార్కండేయునితో ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు వచ్చేస్తాడు. తమ మీద తన భక్తుని మీదకు యమపాశాన్ని విడుస్తావాంటూ యముడిని ఒకదెబ్బతో మట్టుబడెతారు. అప్పుడే పరమేశ్వరునికి కాలాంతకుడు అనే పేరు వచ్చింది. కానీ యముడు లేకపోతే చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగనే సాగదు. అందుకే దేవతలందరూ కూడా శివుడిని ప్రార్ధించి తనను శాంతింపజేస్తారు. దాంతో పరమేశ్వరుడు మళ్లీ యముడిని జీవించేలా చేస్తాడు.
ఇక ఈ సంఘటన తమిళనాడులోని తిరుక్కడయూరు అనే ప్రాంతంలో జరిగిందని అంటుంటారు. అప్పటి నుంచి మార్కెండేయుడు చిరంజీవిగా ఉండటమే కాదు…అష్టాదశ పురాణాల్లో ఒకటై మార్కెండేయ పురాణాన్ని కూడా రాశాడు.