Puja Room Decoration : ఇంట్లో పూజగది డెకొరేషన్‌కు టిప్స్ ఇవీ..
Puja Room Decoration : మన ఇంట్లో పూజగదిని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో నిర్మించుకోవచ్చు.
- Author : Pasha
Date : 27-11-2023 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
Puja Room Decoration : మన ఇంట్లో పూజగదిని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో నిర్మించుకోవచ్చు. పూజ గదిని ఏవైపు నిర్మించుకున్నా.. తూర్పు వైపున చూస్తూ పూజ చేస్తే మంచిది. ఉత్తర దిక్కున దేవతా విగ్రహాలు, ఫోటోలు, యంత్రాలను ఉంచితే దక్షిణ దిక్కును చూస్తాయి. కాబట్టి వాటిని ఆ దిక్కుల్లో ఉంచకూడదు. పడమర, తూర్పు ముఖంగా దేవుడి పటాలు, విగ్రహాలు, యంత్రాలను ఉంచి కూడా పూజ చేయొచ్చు. ఆగ్నేయంలో వంటగది పోగా తూర్పు భాగంలో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. పూజ గదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది. పిరమిడ్ లాంటి ఆకారంగా ఉండే మందిరాన్ని చాలా మంది ఇళ్లల్లో చూసే ఉంటాం. ఇదే బెస్ట్ అని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఇలా చేయండి..
- ఇప్పటికే ఇంట్లో పూజగది ఉండి ఉంటే దాన్ని ఈజీగా డెకొరేట్ చేసుకోవచ్చు.
- మార్కెట్లో దొరికే పీవీసీ షీట్స్‌ను వివిధ డిజైన్లలో కట్ చేసి..పూజగదిలోని గోడలకు అతికించండి.
- పూజ గది కోసం ఇత్తడి వస్తువులను కొనండి.
- వేలాడే గంటలు, ఇత్తడి కుందుల్లాంటివి పూజ గదికి అందాన్ని ఇస్తాయి.
- పూజ చేసే సమయంలో ఆయిల్ డిఫ్యూజర్‌లో కర్పూరం, ఎసెన్సియల్ ఆయిల్‌లను వేసి వేడి చేసుకోండి. వీటి నుంచి వచ్చే పరిమళం మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది.
- పూజ గదిలో వెండి లేదా రాగి ఫ్రేమ్ తో తయారు చేసిన దేవుడి ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలి.
We’re now on WhatsApp. Click to Join.
కొత్త ఇంట్లో పూజగది నిర్మాణం కోసం..
- ఇంట్లో మిగతా గదుల సీలింగ్ ఎంత ఎత్తులో ఉన్నా సరే.. పూజ గది సీలింగ్ మాత్రం తక్కువగా ఉండాలి.
- పూజ గదిలో ఉండే దేవుళ్ల గ్రంథాలు, పూజ సామాగ్రి వంటి వాటిని సర్దుకోవడానికి రెండు కప్ బోర్డ్‌లను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.
- దేవుడి విగ్రహాన్ని ఏదో మూలకు పెట్టకుండా.. గదిలో మధ్యలో పెడితే ఆలయంలా కనిపిస్తుంది.
- పూజ గదికి లైట్ షేడ్స్ ఉన్న రంగులను ఎంపిక చేసుకోవాలి.
- లేత పసుపు, లేత గులాబీ రంగు వేసుకుంటే చూడ్డానికి చక్కగా ఉంటుంది.
- పూజ గదిలో దేవుడిని ఆరాధించడంతో పాటు కొందరు మెడిటేషన్ చేస్తారు.
- గదికి మంచి వెలుతురు వచ్చేలా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది.
- ఒకవేళ వెలుతురు వచ్చే ఛాన్స్ లేకపోతే.. మంచి ఎల్‌ఈడీ లైట్‌లను ఏర్పాటు చేసుకుంటే(Puja Room Decoration) బాగుంటుంది.