995 Jobs -IB : డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 జాబ్స్
995 Jobs -IB : ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో ఉద్యోగ అవకాశమిది. 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- By Pasha Published Date - 11:45 AM, Mon - 27 November 23
![995 Jobs -IB : డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 జాబ్స్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/11/995-Jobs-IB.jpg)
995 Jobs -IB : ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో ఉద్యోగ అవకాశమిది. 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ జాబ్స్‌కు అర్హులు. 2023 డిసెంబర్ 15 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో వయసున్న వారు వీటికి అర్హులు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి శాలరీ పే స్కేలు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది. మొత్తం 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులలో 377 ఓపెన్ కోటాలో భర్తీ చేస్తారు. ఓబీసీలకు 222, ఎస్సీలకు 134, ఎస్టీలకు 133, ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారికి 129 పోస్టులను కేటాయించారు.
అభ్యర్థులు అందరూ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.450 చెల్లించాలి. అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు) అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ డిసెంబరు 15. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబరు 19. ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్ష కేంద్రాల జాబితాలో విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, చీరాల, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. తెలంగాణలోని పరీక్ష కేంద్రాల జాబితాలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ ఉన్నాయి.
Also Read: IT Raids : రామగుండంలో 2 కోట్లు సీజ్.. నారాయణపేట ఎమ్మెల్యే అనుచరులపై ఐటీ రైడ్స్
అభ్యర్థులకు తొలుత టైర్-1, టైర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.అభ్యర్థులు కేంద్ర హోంశాఖ అధికారిక వెబ్సైట్ https://www.mha.gov.in/en లో తమ పేరు మీద ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో(995 Jobs -IB) అప్లై చేయొచ్చు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![SBI Jobs : 1040 జాబ్స్ భర్తీకి ఎస్బీఐ భారీ నోటిఫికేషన్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/12/New-Project-44.jpg)
SBI Jobs : 1040 జాబ్స్ భర్తీకి ఎస్బీఐ భారీ నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.