Study Room Vastu : మీ పిల్లలు చదువులో వెనకపడ్డారా? అయితే స్టడీ రూమ్ లో ఈ మార్పులు చేయండి..!!
- By hashtagu Published Date - 07:58 AM, Mon - 21 November 22
చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డ సరిగ్గా చదవడం లేదని ఆందోళణ చెందుతుంటారు. మా పిల్లలకు చదువు సరిగ్గా రావడం లేదంటూ ఫిర్యాదు చేస్తుంటారు. అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు మానసిక క్షోభకు గురవుతుంటారు. అయితే పిల్లల ఎదుగుదల తోపాటు చదువు విషయంలోనూ వాస్తు దోషాల వల్ల ఆంటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పిల్లలకు సంబంధించిన స్టడీ రూమ్ లో కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా చేయాల్సిందే అంటున్నారు. ఇలా చేస్తే పిల్లలు ప్రతిపరీక్షలోనూ రాణిస్తారు. మనస్సు మెరుగుపడుతుంది. ఆ వాస్తు నియమాలేంటో తెలుసుకుందాం.
1. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్టడీ రూమ్ ఎప్పుడు కానీ ఇంట్లో ఈ శాన్య దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. ఈ దిశలో కూర్చుని చదువుకుంటే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
2. దక్షిణ దిశలో కూర్చుండి చదవుకోకూడదు. ఈ దిశలో స్టడీ రూం ఏర్పాటు చేయకూడదు.
3. స్టడీ రూం ఎప్పుడూ కూడా మెట్ల కింద ఉండకూడదు. అంతేకాదు ఇంట్లోని దూలానికి కింద, దూలానికి ఆనుకుని ఉండకూడదు.
4. వాస్తుప్రకారం గది తలుపులు తూర్పు దిశలో ఉండాలి. ఇలా ఉంటే పిల్లలు ఉదయం నిద్రలేచి సూర్యభగవానుడిని దర్శించుకుంటారు.
5. తూర్పు వైపు కిటికీలు ఉండకూడదు. ఎందుకంటే పగటిపూట తూర్పున ప్రారంభం అవుతుంది. తూర్పు వైపు కిటికి ఉండటం వల్ల స్టడీ రూమ్ లో సానుకూలత ఉంటుంది.
6. స్టడీ రూమ్ లో ఆహారం తినకూడదు.
7. హింసాత్మక ఫొటోలు, ఉండకూడదు. సరస్వతీ మాత, లేదంటే స్పూర్తిదాయకమైన వ్యక్తి చిత్ర పటం ఉండాలి.
8. విద్యుత్ పరికాలను ఆగ్నేయ కోణంలో ఉంచాలి. ల్యాప్ టాప్, కంప్యూటర్, మొదలైనవి ఉంచకూడదు. మీ పిల్లలపై మంచి ప్రభావం ఉంటుంది.
Tags
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.