Arjuna-Phalguna: పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు
మామూలుగా వర్షం పడినప్పుడు పిడుగులు రావడం అనేది సహజం. అయితే ఈ పిడుగులు పడేటప్పుడు మన ఇంట్లోనే పెద్దవారు అర్జున ఫాల్గుణ అని అనమని చెబుతూ ఉంటార
- By Nakshatra Published Date - 09:06 PM, Thu - 6 July 23
మామూలుగా వర్షం పడినప్పుడు పిడుగులు రావడం అనేది సహజం. అయితే ఈ పిడుగులు పడేటప్పుడు మన ఇంట్లోనే పెద్దవారు అర్జున ఫాల్గుణ అని అనమని చెబుతూ ఉంటారు. అలా అనడం వల్ల పిడుగు పడదు అని చెబుతూ ఉంటారు. అయితే దాని వెనుక ఉన్న అసలు రీసన్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. కానీ కొంతమంది పెద్దలు అలా పిడుగులు పడే సమయంలో అర్జున,ఫాల్గుణ అని అంటే ఆ పిడుగులు మన దగ్గరలో దరిదాపుల్లో పడవని చెబుతూ ఉంటారు. ఇవి పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినపుడు కూడా జపించవచ్చు. మహాభారతంలో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది.
పాండవులు అరణ్యవాసం పూర్తైన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతూ ఉంటారు. విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు. పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు. అప్పుడు ఉత్తరకుమారుడు యుద్ధానికి బయలుదేరగా బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తారు. అయితే కౌరవ సైన్యం లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు. అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.
అప్పటికే పూర్తిగా భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు. నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు. అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి. ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు. గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని
ఎంతటి వీరుడి నైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని, దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరీటి అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి భయం పోగొడతాడు. కాబట్టి ఫాల్గుణ నామం వెనుక ఉన్న అర్థం ఇదే. ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే ఆ ప్రభావం, ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెబుతారు.
Related News
Vinesh Phogat: ఫుట్‌పాత్‌పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు
డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.