Lunar Eclipse – Today : ఇవాళ చంద్రగ్రహణం.. ఈ రాశులవాళ్లు చూడొద్దు
Lunar Eclipse - Today : ఈ ఏడాదిలో చిట్టచివరి చంద్రగ్రహణం ఇవాళ సంభవించనుంది.
- By Pasha Published Date - 08:54 AM, Sat - 28 October 23

Lunar Eclipse – Today : ఈ ఏడాదిలో చిట్టచివరి చంద్రగ్రహణం ఇవాళ సంభవించనుంది. ఈరోజు రాత్రి 1:05 నిమిషాలకు చంద్ర గ్రహణ స్పర్శ కాలం ప్రారంభమై.. రాత్రి 2:22 నిమిషాలకు మోక్షకాలం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో కనిపిస్తుంది. చంద్రుడు పాక్షికంగా భూమి నీడ గుండా వెళుతున్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణ సమయంలో ప్రజలంతా తమ ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి. కొన్ని రాశులకు చెందిన రాజకీయ నేతలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో ఇబ్బందులు తప్పవంటున్నారు జ్యోతిష్యులు. ప్రత్యేకించి మేషం, వృషభం, కన్య, మకర రాశికి చెందిన రాజకీయ నేతలు ఈ గ్రహణంతో అశాంతికి లోనయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఎవరు చూడకూడదు ?
మేష, కర్కాటక, సింహరాశుల వారు, అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు ఈ చంద్ర గ్రహణం చూడకూడదు. కుమార పౌర్ణమి పూజలు, వ్రతాలు, నోములు నోచుకునే వారంతా శనివారం మధ్యాహ్నం 3.30 గంటలలోగా పూర్తి చేయాలి. ప్రసాదాలు (భోజనం) 4 గంటలు లోపుగా తీసుకోవాలని, తర్వాత ఆహారం భుజించరాదు. మూడు రాశులు, అశ్విని నక్షత్రం వారికి మినహాయిస్తే మిగతా తొమ్మిది రాశుల వారికి శుభ ఫలితాలు(Lunar Eclipse – Today) కలుగుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
గ్రహణం టైంలో ఏంచేయాలి ? ఏం చేయకూడదు ?
- గ్రహణం టైం ప్రారంభమయ్యాక శుభకార్యాలు చేయకూడదు.
- ఆహార పదార్థాలు వండకూడదు, తినకూడదు. చిన్నపిల్లలు, ముసలివాళ్లు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఈ నియమం వర్తించదు.
- గ్రహణం మొదలవ్వకముందే దేవాలయాలు మూసివేస్తారు. కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను తెరిచి ఉంచుతారు.
- గర్భిణులు బయటకు వెళ్లకూడదు.
- గర్భిణులు గ్రహణానికి ముందే ఆహారం తీసుకోవడం మంచిది.
- గర్భిణులు చంద్రగ్రహణం టైంలో శ్రీఫలాన్ని తమతో పాటే ఉంచుకోవాలి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఉదయాన్నే శ్రీఫలాన్ని కడగాలి.
- ఒకవేళ గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవాలనుకుంటే.. తులసి ఆకులు ముందుగా అందులో వేయాలి.
- గ్రహణ సమయంలో నిద్రించకూడదు..ప్రయాణాలు చేయకూడదు.
- గ్రహణం టైంలో కూరగాయలు, పండ్లు తరిగే పని చేయకూడదు.
- ఇంట్లో నిల్వ ఉండే పదార్థాలపై గరిక వేసి ఉంచాలి.
- శ్మశానాలు, ప్రతికూల ప్రదేశాలకు వెళ్లకూడదు.
Also Read: New Slippers Problems : కొత్త చెప్పులు కరవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.