Lord Hanuman Prayer: అమావాస్యనాడు హనుమంతుని ప్రార్థన అమోఘం!
ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
- Author : Balu J
Date : 27-08-2022 - 10:02 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.
అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.
“అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వదః
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో ”
అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.
ఆపదుద్ధారకశ్రీహనుమత్_స్తోత్రం..
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।
అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోస్తు తే ॥ ౧॥
సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।
తాపత్రయస్య సంహారిన్నాఞ్జనేయ నమోస్తు తే ॥ ౨॥
ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే ।
ప్రాణాపహన్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ ౩॥
సంసారసాగరావర్తాగతసమ్భ్రాన్తచేతసామ్ ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తు తే ॥ ౪॥
రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూతసఙ్కులే ।
గజసింహమహావ్యాఘ్రచోరభీషణకాననే ॥ ౫॥
మహాభయేఽగ్నిసంస్థానే శత్రుసఙ్గసమాశ్రితే ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమో నమః ॥ ౬॥
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరన్త్యఞ్జనాసుతమ్ ।
అర్థసిద్ధియశఃకామాన్ ప్రాప్నువన్తి న సంశయః ॥ ౭॥
కారాగృహే ప్రయాణే చ సఙ్గ్రామే దేశవిప్లవే ।
యే స్మరన్తి హనూమన్తం తేషాం నాస్తి విపత్తయః ॥ ౮॥
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే ।
నమః ప్లవగసైన్యానాం ప్రాణభూతాత్మనే నమః ॥ ౯॥
దుష్టదైత్యమహాదర్పదలనాయ మహాత్మనే ।
బ్రహ్మాస్త్రస్తమ్భనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే ॥ ౧౦॥
జప్త్వా స్తోత్రమిదం పుణ్యం వసువారం పఠేన్నరః ।
రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జపేద్ధ్రువమ్ ॥ ౧౧॥
విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।
సర్వాపద్భ్యో విముచ్యేత నాత్ర కార్యా విచారణా ॥ ౧౨॥
మంత్రం:
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక |
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే ||
ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం ||