Lord Ganesha : బొజ్జ గణపయ్యకు బోల్డన్ని పేర్లు…ఒక్కో పేరుకు ఒక్కో అర్థం..!!
గణేషుడు...వినాయకుడు..ఏకదంతుడు..విఘ్నేశ్వరుడు...లంబోదరుడు...బాలచంద్ర ఇలా విఘ్నాలను తొలగించే బొజ్జగణపయ్యకు ఎన్నో పేర్లు ఉన్నాయి.
- Author : hashtagu
Date : 28-08-2022 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
గణేషుడు…వినాయకుడు..ఏకదంతుడు..విఘ్నేశ్వరుడు…లంబోదరుడు…బాలచంద్ర ఇలా విఘ్నాలను తొలగించే బొజ్జగణపయ్యకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా..ఆ గణనాథుడు ఇట్టే పలుకుతాడు. భక్తుల మొరను ఆలకిస్తాడు. ఎంతో భక్తితో చేసే పూజలను వీక్షిస్తాడు. ఎలా పిలిచినా…ఏ పేరుతో పిలిచినా…పలికే వినాయకుడికి చాలా పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ పేర్లేమిటి…వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం.
1. విఘ్నహర్త:
గణేశుడిని విఘ్నహర్త అని కూడా పిలుస్తారు. విఘ్నహర్త అంటే అన్ని సమస్యలు, బాధలను తొలగిస్తుందని అర్థం. గణపయ్య తన భక్తులకు ఎలాంటి కష్టాలు, ఆటంకాలు రాకుండా విఘ్నాలు తొలగించేవాడు.
2. గజానన:
గజానన అంటే ఏనుగు ముఖం కలవాడు. వినాయకుడికి ఏనుగు ముఖం, మానవ శరీరం ఉంటుంది. కాబట్టి గజానన అంటే ఏనుగు ముఖం అని అర్థం.
3. లంబోదర:
వినాయకుడిని ‘లంబోదర’ అని కూడా పిలుస్తారు. లంబోదర అంటే పెద్ద పొట్ట ఉన్నవాడు. ముద్గల పురాణం ప్రకారం, లంబోదర అవతారంలో ఉన్న గణేశుడు కోపంతో ఉన్న క్రోధాసురుడి నుండి దేవతలను రక్షించాడు.
4. వినాయకుడు:
అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు అంటే గణాలకు అధిపతి అని అర్థం.
5. ఏకదంతుడు:
ఏక అంటే ఒకటి. ఒక్కటే దంతం కలవాడు అని అర్థం.
6. ఓంకారుడు:
ఓంకారుడు అంటే సరైన జీవితాన్ని ఇచ్చేవాడని అర్థం.
7. సుముఖ:
అందమైన ముఖం కలవాడు. ఏనుగు ముఖం ఉన్న వినాయకుడిని సుముఖ అంటారు.
8. బాలచంద్ర:
వినాయకుడిని ‘బాలచంద్రుడు’ అంటారు. అంటే చంద్రుడిని తలపై మోస్తున్నవాడు అని అర్థం. బ్రహ్మాండ పురాణం ప్రకారం గణేశుడు చంద్రుడిని దర్భి సంత్ శాపం నుండి రక్షించాడు. బాలునిగా కరుణించి చంద్రుని నుదుటిపై తిలకంగా ధరించాడు.
9. అవనీషుడు:
ప్రపంచాన్ని ఏలేవాడు అని అర్థం.
10. అద్వైత :
ఒకే వ్యక్తిత్వం ఉన్నవాడు అని అర్ధం.
ఇవే కాదు వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి..
1. బాల గణపతి
2. భక్తి గణపతి
3. ధుంధి గణపతి
4. దుర్గా గణపతి
5. ద్విజ గణపతి
6. ద్విముఖ గణపతి
7. ఏకదంత గణపతి
8. ఏకాక్షర గణపతి
9. హరిద్ర గణపతి
10. హీరాంబ గణపతి
11. క్షిప్ర గణపతి
12. క్షిప్ర ప్రసాద గణపతి
13. లక్ష్మీ గణపతి
14. మహా గణపతి
15. నృత్య గణపతి
16. రుణమోచన గణపతి
17. సంకటహర గణపతి
18. శక్తి గణపతి
19. సిద్ధి గణపతి
20. సింహ గణపతి
21. సృష్టి గణపతి
22. తరుణ గణపతి
23. త్రిముఖ గణపతి
24. త్య్రక్షర గణపతి
25. ఉచ్ఛిష్ట గణపతి
26. ఉద్దండ గణపతి
27. ఊర్ధ గణపతి
28. వరద గణపతి
29. విఘ్న గణపతి
30. విజయ గణపతి
31. వీర గణపతి
32. యోగ గణపతి