Lizard: పూజ గదిలో దేవుడి ఫోటోల వెనక బల్లి కనిపించిందా.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
Lizard: మన ఇంట్లోని పూజ గదిలో దేవుడి ఫోటోల వెనుక బల్లి కనిపించడం అన్నది దేనికి సంకేతమో, ఇది శుభమా లేక అశుభమా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Tue - 14 October 25

Lizard: మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు తప్పనిసరిగా ఉంటాయి. ఇంట్లో, పూజ గదిలో బాల్కనీలో వంటగదిలో ఇలా ఎక్కడపడితే అక్కడ బల్లులు ఉంటాయి. బల్లులు లేని ఇండ్లు దాదాపుగా ఉండవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బల్లి ని చూస్తే చాలు చాలామంది తెగ భయపడిపోతూ ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. ఎప్పుడైనా పూజ గదిలో వంట గదిలో కనిపిస్తే తెగ భయపడిపోతూ ఉంటారు. అయితే ఇంట్లో గోడలపై కనిపించే బల్లి చాలామందికి భయానకంగా,వికారంగా అనిపించవచ్చు.
అయితే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా దేవుడి ఫోటోల వెనుక బల్లులు తిరుగుతుంటాయి. ఇంట్లో దేవుడి ఫోటో దగ్గర బల్లి తిరుగుతుంటే చాలా మంది చూసే ఉంటారు. కొంతమంది దానిని శుభమని భావిస్తారు. మరికొంతమంది మాత్రం దీన్ని చెడు శకునంగా భావిస్తారు. మరి దేవుడి ఫోటోల వెనుక బల్లి కనిపించడం అన్నది శుభమా లేక ఆ శుభమా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దేవుడి ఫోటో వెనుక కనిపిస్తే, కొందరు దాన్ని మంచి శకునంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తులు రాబోతున్నాయి అనే సూచనగా పరిగణిస్తూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు కుటుంబంలో మంచి మార్పులు వస్తాయని, సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని నమ్మకం.
బల్లి దేవుడి ఫోటో వెనుక తిరుగుతున్నప్పుడు ఇంట్లో ఆర్థికంగా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కొంతమంది అయితే ఇది లక్ష్మీదేవి అనుగ్రహం అని కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవాళ్లైతే దీన్ని ధనప్రాప్తికి సూచనగా చూస్తారు. ఇదివరకటి రోజుల్లో అయితే బల్లి దేవుడి సమక్షంలో కనిపిస్తే ప్రత్యేక పూజలు కూడా చేస్తుండేవారు. కొన్ని కుటుంబాల్లో బల్లిని ఒక శకునంగా కూడా భావిస్తారు. కానీ ఇది శుభ శకునమా, చెడు శకునమా అన్నది ఎవరి విశ్వాసాన్ని బట్టి మారుతుంది.