LaxmiDevi: ఆ రూపం ఉన్న లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?
మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాలు ఫోటోలు తప్పనిసరిగా ఉంటాయి. కొందరు పెద్దపెద్ద ఫోటోలను, విగ్రహాలను పెట్టుకొని మరి పూజిస్తూ
- By Nakshatra Published Date - 04:45 PM, Mon - 4 December 23
మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాలు ఫోటోలు తప్పనిసరిగా ఉంటాయి. కొందరు పెద్దపెద్ద ఫోటోలను, విగ్రహాలను పెట్టుకొని మరి పూజిస్తూ ఉంటారు. కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపార స్థలాలలో కూడా లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. కొందరు లక్ష్మీదేవికి సంబంధించిన యంత్రాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అంటే కొన్ని రకాల చిత్రపటాలు అస్సలు ఉండకూడదు. ధనలక్ష్మీ ఇంట్లో కొలువు దీరాలంటే ఈ రూపంలో ఉన్న చిత్రాలను ఇంట్లో అస్సలు ఉంచుకోరాదని పండితులు చెబుతున్నారు. ఇటువంటి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక లాభం ఏమో కానీ నష్టం అయితే భారీగా ఉంటుందట.
ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయట. మానసిక ప్రశాంతత కరువవుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ల దగ్గర సేదతీరుతున్న ఫోటోలను పూజిస్తే మంచి జరుగుతుందట. అలాంటి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల ఆ ఇంట్లో దంపతులు అన్యోన్యంగా ఉంటారు. తామరపువ్వు పై కూర్చున్నటి వంటి దేవతామూర్తిని కొలిస్తే అంతా శుభం జరుగుతుంది. ఇక లక్ష్మీ దేవితో పాటు సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుడికి పూజిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. అటువంటి వారు ఆర్థికంగా మెరుగవుతారు. కుబేరుడి యంత్రం, ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే ధన ప్రాప్తి కలుగుతుంది. మరికొందరు కుబేరుడి ఉంగరాలను కూడా ధరిస్తుంటారు.
ఇలా చేయడం వలన ధనలాభం కలుగుతుందని కొందరు బలంగా నమ్ముతుంటారు.అదేవిధంగా విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడిపై లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉన్న ఫోటోలను పూజించండం వలన కూడా ధనలాభం చేకూరుతుంది. కొందరు తమ ఇళ్లల్లో వెండి, బంగారంతో లక్ష్మీ దేవి విగ్రహాలను చేయించుకుని పూజిస్తుంటారు. దీని బదులు పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. ధనం కూడా పెద్దఎత్తున సమకూరుతుంది. అయితే గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోలను మాత్రం ఇంట్లో అస్సలు ఉంచుకోరాదు. ఇది అనేక ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. పెద్దమొత్తంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఈ ఇంట్లో కనుక అలాంటి ఫోటో ఉంటే వెంటనే తీసి బయటకు పారేయండి. ఎందుకంటే అలాంటి ఫోటోని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి.
Related News
Garlic: ఆ ఒక్క పని చేస్తే చాలు నెలలపాటు పాడవని వెల్లుల్లి.. అదెలా సాధ్యం అంటే?
మన వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిం